పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' అనే సినిమాలో నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించి ఓ పోస్టర్ ను వదిలింది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. కథ ప్రకారం 'సలార్'లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారట. రెండు వేర్వేరు టైం పీరియడ్స్ లో సినిమా సాగుతుందని సమాచారం. 

 

దానికి తగ్గట్లుగా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. అందులో ఒకటి రగ్డ్ అండ్ మ్యాన్లీ లుక్ కాగా.. మరొకటి కొంచెం క్లాస్ గా కనిపించే క్యారెక్టర్ అని తెలుస్తోంది. అందుకే ప్రభాస్ బాగా స్లిమ్ అయినట్లు తెలుస్తోంది. నిన్న దర్శకుడు ఓం రౌత్ ఇంట్లో పార్టీకి అటెండ్ అయ్యారు ప్రభాస్. ఈ సందర్భంగా ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

 

ఫుల్ మజిల్స్ తో ఉండే ఈ హీరో సడెన్ గా ఎందుకు సన్నబడ్డాడా..? అని అంతా అనుకున్నారు. 'సలార్' సినిమాలో తన సెకండ్ రోల్ కి కోసం ప్రభాస్ స్లిమ్ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

మరోపక్క ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే నాగశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాల మధ్యలో దర్శకుడు మారుతి తీయబోయే ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తారని అంటున్నారు.