టాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే. ఆమె అఖిల్‌తో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె నటిస్తున్న ‘ఆచార్య’, ‘రాధేశ్యా్మ్’ చిత్రాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. మరోవైపు తమిళంలో హీరో విజయ్‌తో కలిసి ‘బీస్ట్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా పూజా తన అభిమానులతో మనసు విప్పి మాట్లాడేందుకు టైమ్ కేటాయించింది. సోమవారం ట్విట్టర్‌లో #AskPooja అంటూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగా ఆన్సర్స్ ఇచ్చింది.


జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పండి అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘రియల్’ అని తెలిపింది. అనంతరం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ గురించి చెప్పాలని ఓ అభిమాని అడిగాడు. ఇందుకు పూజా ఆన్సర్ చేస్తూ.. ‘‘ఆ సినిమా గురించి చెప్పలేను. కానీ, నా కొత్త చిత్రంలో నా పర్‌ఫార్మెన్స్ గురించి చిరంజీవిగారు మేస్సేజ్‌ చేయడం చాలా సంతోషాన్ని నింపింది. ఇంకా హార్డ్‌ వర్క్‌ చేయాలనే ప్రేరణ కలిగింది’’ అని పూజా తెలిపింది. మరికొన్ని ప్రశ్నలకు పూజా చెప్పి సమాధానాలివి.. 


Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు


మీమ్మల్ని బాగా డిస్ట్రబ్ చేసిన చిత్రం?: ‘ఇన్ టు ది వైల్డ్’
మన రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడు ప్రకటిద్దాం (ఫ్యాన్ కొంటె ప్రశ్న): రక్షాబంధన్ రోజు (పూజా పంచ్).
మెస్సీ లేదా రోనాల్డోలో ఎవరు ఇష్టం?: మెస్సీ.
మీరు ఎవరితో నటించాలని కలగంటున్నారు?: అమితాబ్ బచ్చన్‌తో. ఏదో ఒక రోజు అది నిజమవుతుంది.
మీరు స్కూల్‌లో చదువుతున్నప్పుడు మీకు ఇష్టమైన పిరియడ్స్?: ఇంగ్లీష్, పిజిక్స్. 
యష్ గురించి ఒక మాటలో చెప్పండి: కన్నడ ఇండస్ట్రీని గర్వపడేలా చేస్తు్న్నారు.
పెద్ద హీరోలు, భారీ చిత్రాలకు సమయం ఎలా కేయిస్తున్నారు?: నేను చాలా తక్కువ నిద్రపోతాను. సినిమా పేరుతో విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటాను. నేను చేస్తున్న పని పట్ల నిజంగా ఉత్సాహంగా ఉన్నా. అది నన్ను ఉత్సాహంగా ఉంచుతుంది. 


Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి