ABP  WhatsApp

Puneeth Rajkumar Demise: 'విధి ఎంత వంచించింది..!' పునీత్ రాజ్‌కుమార్ మృతిపై మోదీ భావోద్వేగం

ABP Desam Updated at: 29 Oct 2021 06:07 PM (IST)
Edited By: Murali Krishna

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పునీత్ మృతిపై మోదీ భావోద్వేగ ట్వీట్

NEXT PREV


విధి ఎంత బలీయమైనదో.. మనందరి నుంచి పునీత్ రాజ్‌కుమార్ లాంటి ఓ గొప్ప నటుడ్ని దూరం చేసింది. ఇలా వెళ్లిపోయే వయసు మీది కాదు. మీరు చేసిన సేవలు, మీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని రాబోయే తరాలు కుడా గుర్తుంచుకుంటాయి. ఆయన కుటంబం, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.                             -  ప్రధాని నరేంద్ర మోదీ






కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటలీ పర్యనటలో ఉన్న మోదీ.. ఈ వార్త తెలిసిన వెంటనే ట్వీట్ చేశారు. మోదీతో పాటు ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ సినీ లోకం ఆయన నిష్క్రమణతో శోకసంద్రంలో మునిగిపోయింది.







ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరని తెలిసి చాలా బాధపడుతున్నాను. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి అద్భుతమైన యాక్టర్‌గా, నేపథ్య గాయకుడిగా, బుల్లితెర వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఆయన ఎదిగిన తీరు అనన్యసామాన్యం. ఎన్నో నైపుణ్యాలు కలిగిన గొప్ప వ్యక్తి పునీత్.                         -     వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి



కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటు. పునీత్ ఇక లేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.                               - బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం


కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ ప్రముఖులు అంతా పునీత్ రాజ్‌కుమార్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 


Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?


Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత


Also Read: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..


Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?


Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 29 Oct 2021 06:07 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.