జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ శుక్రవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‌కు లేఖ రాశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ విషయంపై తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫేస్‌బుక్, వాట్సాప్ తరపున ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ కోర్టులో హాజరయ్యారు. రిజిస్ట్రార్ జనరల్ విజ్ఞప్తి చేసిన వెంటనే పోస్టులు తొలగించాలని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్ తెలిపారు. పంచ్ ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌ను ఎవరో వెనుక నుంచి నడిపిస్తున్నారని స్టాండింగ్ కౌన్సిల్ అనుమానం వ్యక్తం చేసింది.
Also Read: చర్రితలో తొలిసారి... 9 మంది సుప్రీం జడ్జిలు ప్రమాణ స్వీకారం... మొత్తం జడ్జిల సంఖ్య ఎంతంటే?
పంచ్ ప్రభాకర్ అరెస్టుకు చర్యలు చేపట్టండి : హైకోర్టు
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలపై లేఖ వస్తే అభ్యంతర పోస్టులను తొలగిస్తామని యూట్యూబ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నా అభ్యంతర పోస్టులు ఎందుకు నిలువరించలేకపోతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్ ను నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ను సంప్రదించామని వారి నుంచి అనుమతి దొరకడం లేదని సీబీఐ చెప్పింది. హైకోర్టుపై వ్యాఖ్యలు చేసినా పట్టుకోకపోతే సామాన్యుడి సంగతేంటని ప్రశ్నించింది.
Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు... ఐదుగురిని అరెస్టు చేసిన సీబీఐ
ఇప్పటికే 11 మంది అరెస్టు
న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇటీవలె ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిస, సుద్దులూరి అజయ్ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్ 11న జడ్జిలపై అనుచిత పోస్టుల కేసును దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ మరో ఆరుగురిని అరెస్టు చేసింది.
Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి