పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో  గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుగుతోంది. అందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


యుద్ధం ముగిసింది!
'హరి హర వీర మల్లు' సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసినట్లు ఫైట్ మాస్టర్ విజయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని అందించారు. పవర్ స్టార్‌కు విజయ్ మాస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యిందని పేర్కొన్నారు.
'హరి హర వీర మల్లు' కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశం హైలెట్ అవుతుందని టాక్. గెరిల్లా తరహాలో పవన్ పోరాటం చేసే దృశ్యాలను తెరకెక్కించారని సమాచారం. 


Also Read : 'మా బావ మనోభావాలు' - బాలకృష్ణ టార్గెట్ ఎవరు?


'హరి హర వీర మల్లు' సెట్స్ మీద ఉండగా... హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారట. దీంతో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఆయన ప్రత్యేక పాత్రలో నటించనున్న తమిళ హిట్ 'వినోదయ సీతం' రీమేక్ కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలని భావిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. వచ్చే ఏడాది ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు టాక్. 


Also Read : మెగా కజిన్స్ సీక్రెట్ శాంటా - క్రిస్మస్ కోసం కలిసి రామ్ చరణ్, అల్లు అర్జున్






ఔరంగజేబుగా బాబీ డియోల్!
'హరి హర వీర మల్లు' సినిమాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో మల్ల యోధుడు మల్లుగా పవన్ కనిపించనున్నారు. మన భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆ కాలం నాటి సెట్స్ వేశారు.


పవన్ స్పెషల్ వర్క్ షాప్స్!
'హరి హర వీర మల్లు' కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. ఆ మధ్య స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరిగాయి. దానికి పవన్ అటెండ్ అయ్యారు. దాని కంటే ముందు కొన్ని రోజులు స్టంట్స్ ప్రాక్టీస్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కీలక పాత్రలో కనిపించనున్నారు.


మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.