నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి సినిమా వస్తోంది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఆ రెండూ ఓ లెక్క... ఇప్పుడు రాబోతున్న మూడో పాట మరో లెక్క!


మా బావ మనోభావాలు
మనోభావాలు... వార్తల్లో ఈ పదం ఎక్కువ వినబడుతుంది. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని, తమ మనోభావాలను కించపరిచారని కొందరు ఆందోళనలు చేయడం చూస్తుంటాం. మరి, బాలకృష్ణ ఎవరిని టార్గెట్ చేశారో తెలియదు కానీ... 'మా బావ మనోభావాలు' అంటూ కొత్త పాటతో వస్తున్నారు. 


డిసెంబర్ 24న 'మా బావ మనోభావాలు'
'వీర సింహా రెడ్డి'లో తొలి పాట 'జై బాలయ్య'కు మిశ్రమ స్పందన లభించింది. 'ఒసేయ్ రాములమ్మ' ట్యూన్ తరహాలో ఉందని చెప్పారు. రెండో పాట 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్ మధ్య స్టెప్పులు అలరించాయి. ఆ రెండిటితో పోలిస్తే... 'మా బావ మనోభావాలు' డిఫరెంట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. దీనిని ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. 'సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ ఈ పాటలో బాలకృష్ణ స్టిల్ విడుదల చేసింది టీమ్.


'వీర సింహా రెడ్డి'లో మూడు లుక్కులు!
సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie) సినిమాతో నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నారు. అందులో ఆయనది డ్యూయల్ రోల్. ఆ న్యూస్ తెలిసిందే. లేటెస్ట్ టాక్ ఏంటంటే... అందులో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారట.


'వీర సింహా రెడ్డి'లో ఫ్యాక్షన్ లీడర్ లుక్ ఫస్ట్ విడుదల చేశారు. అది తండ్రి క్యారెక్టర్. రెండోది కుమారుడి క్యారెక్టర్. ఇటీవల విడుదలైన 'సుగుణ సుందరి'లో ఆ లుక్ అంతా చూశారు. కథానుగుణంగా కుమారుడు విదేశాల్లో ఉంటాడు. అప్పటి లుక్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కుమారుడి లుక్‌లో చేంజెస్ ఉంటాయని తెలిసింది.


Also Read : నయనతార తలవంచక తప్పలేదు - థియేటర్స్ యజమానుల మాటే నెగ్గింది






బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర (Naveen Chandra), మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read : షూటింగ్‌కు హీరోయిన్ డుమ్మా - సీరియస్ అయిన బాలకృష్ణ