టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలిటిక్స్ లో తన మార్క్ ను చూపిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో వస్తోన్న ఫాంటసీ డ్రామా మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. మామ అల్లుళ్ల కలయికలో వస్తోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోధాయ సీతమ్’ సినిమాకు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన కొన్ని మేకింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన పక్కనే సాయి ధరమ్ తేజ్ కూడా నిలబడి ఉన్నారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయంటూ ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు చూసుకొని తెగ మురిసిపోతున్నారట ఫ్యాన్స్. ఇక పవన్ బ్యాక్ డ్రాప్ లో ఓ బైక్ కూడా కనిపిస్తోంది. అయితే ఆ బైక్ ను సినిమాలో ఎవరు వాడారు అనేది ప్రశ్న. అయితే అలాంటి బైక్ నే పవన్ ‘గోపాల గోపాల’ సినిమాలో కూడా వాడారు. సేమ్ ఆ సినిమా లాగానే ఈ సినిమాలో కూడా పవన్ దేవుడి పాత్రలో బైక్ మీద ఎంట్రీ ఇస్తారా అని చర్చించుకుంటున్నారట ఆయన అభిమానులు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు సంబంధించి ఆయన లుక్స్ లీక్ అవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇక పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ లు పూర్తిచేసే పనిలో ఉన్నారట పవన్. ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే యోచనలో మేకర్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఒరిజినల్ కథను అలాగే ఉంచుతారా లేదా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు ‘దేవర’, ‘దేవుడు’ అనే టైటిల్స్ పరిశీలనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరుకు పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసి తర్వాత మిగిలిన భాగాల్ని పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే..