Online Love Story : సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు  చదువురు రాని వారు కూడా బాగా ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత లవ్ స్టోరీలు కూడా పెరిగిపోయాయి. ఆన్ లైన్‌లో చాటింగ్ చేసుకోవడం.. పెళ్లి చేసుకోవడం కోసం ఎక్కడి నుంచో మరెక్కడికో వెళ్లడం. అక్కడ మోసపోవడం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. కొన్ని సక్సెస్ కూడా అవుతాయి.. అది వేరే విషయం. కానీ ఓ లవ్ స్టోరీ మాత్రం గమ్యానికి చేరకుండా మధ్యలో ఆగిపోయింది. ఎక్కడో కాదు మన చిత్తూరులోనే.                           


ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాయల్ కౌతా కు అస్సాంకు చెందిన ఎంఎస్.బాబుతో   ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు..   ఎంఎస్.బాబు బెంగుళూరులో  చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వీరి సోషల్ మీడియా చాటింగ్‌లు ప్రేమకు దారి తీశాయి. గత రెండేళ్లుగా ఆన్ లైన్‌లోనే ప్రేమించుకుంటున్నారు. ఒక్క సారి కూడా కలుసుకోలేదు. ఈ లోపు పాయల్‌కు ఇంట్లో వాళ్లు వివాహ సంబంధాలు చూశారు. తాను ఇంట్లో చూపించిన వాని పెళ్లి చేసుకోనని.. తనను తీసుకెళ్లాలని ఎంఎస్ బాబును పాయల్ కోరింది.అయితే దానికి ఎంఎస్ బాబు ఒప్పుకోలేదు. కానీ చనిపోతానని హెచ్చరించడంతో సరే బెంగళూరు రమ్మన్నాడు.                           


పాయల్ ప్రియుడు పిలిచాడు కదా అని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఝార్ఖండ్‌లో బెంగళూరు వెళ్లేందుకు రైలెక్కింది. పాయల్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు   కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు   బస్సు, రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలను పరిశీలించారు.  పాయల్  ట్రైన్  ఎక్కినట్లు గుర్తించి రైల్వే అధికారులను సమాచారం ఇచ్చారు.  ఫోటో, వివరాలను పంపారు.  అప్రమత్తంమైన రైల్వే పోలీసులు చిత్తూరు చేరుకున్న తర్వాత   పాయల్‌న ుగుర్తించారు  ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి 1:30 గంటలకు చిత్తూరు రైల్వే స్టేషనులో పాయల్ కౌతాను గుర్తించి రైల్వే పోలీసులు చిత్తూరులోని వన్ స్టాప్ సెంటర్ కు   తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు..                                    


పాయల్ కుటుంబసభ్యులు రావడంతో..  కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. ఎంఎస్ బాబుతోనూ పోలీసులు మాట్లాడారు.  పాయల్   బెంగుళూరుకి ఇంట్లో చెప్పకుండా వస్తున్నట్లు ఎంఎస్.బాబుకి తెలియజేయడంతో పాయల్‌ ను తిరిగి తన కుటుంబ సభ్యులకే అప్పగించాలని కోరాడు. దీంతో ఆ లవ్ స్టోరీకి అక్కడ తెరపడింది. పాయల్ ను తీసుకుని కుటుంబసభ్యులు ఝార్ఖండ్ వెళ్లిపోయారు.