గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్' (Unstoppable Talk Show). విజయవంతంగా ఫస్ట్ సీజన్ పూర్తి అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్ చివరి మజిలీకి చేరుకుంది. సెకండ్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు అతిథిగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అందులో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ డిప్రెషన్...
సూసైడ్ చేసుకోవాలనుకున్నా!
'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవన్ కళ్యాణ్ పవర్ టచ్ ఇచ్చారు. ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ పార్టు సరదాగా సాగింది. మూడు పెళ్లిళ్ల గురించి పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆయనతో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాసేపు సందడి చేశారు. పెళ్లిళ్లు, సాయి తేజ్ రోడ్ యాక్సిడెంట్ మినహా అందులో సీరియస్ టాపిక్స్ లేవు. సరదాగా సాగినా సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది. రెండో పార్టు అయితే అంతకు మించి అనేలా ఉంటుందట.
'అన్‌స్టాపబుల్ 2' పవర్ ఫైనల్ రెండో ఎపిసోడులో పవన్ కళ్యాణ్ తాను డిప్రెషన్ కు గురైన సందర్భంతో పాటు సూసైడికల్ థాట్స్ గురించి ఓపెన్ అయ్యారు.
పవన్ ఆత్మహత్యను ఆపిందెవరు?
''పరీక్షలు అంటే చాలు... నేను ఒత్తిడికి గురి అయ్యేవాడిని. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళేవాడిని. నాకు ఇంకా గుర్తు ఉంది. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. మా అన్నయ్య చిరంజీవి గారు ఇంట్లో లేని సమయంలో ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకుని షూట్ చేసుకుందామని ప్లాన్ చేశా. చిన్న అన్నయ్య నాగబాబు, మా వదిన సురేఖ వల్ల ఆత్మహత్య ప్రయత్నాలను విరమించుకున్నా'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
నా కోసం బ్రతుకు - చిరంజీవి
ఆత్మహత్య ప్రయత్నాల గురించి తెలిసిన తర్వాత చిరంజీవి తనతో మాట్లాడారని పవన్ తెలిపారు. ''నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదురా! నా కోసం బతుకు. దయచేసి నా కోసం బతుకు'' అని చిరంజీవి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అప్పటి నుంచి పుస్తక పఠనం, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్, కర్ణాటిక్ సంగీతం వినడం వంటివి స్టార్ట్ చేశానని పవర్ స్టార్ వెల్లడించారు.
ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు! - పవన్
తాను సోషల్ పర్సన్ కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిన్నతనంలో తనకు ఆస్తమా ఉండటం కారణంగా తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అందువల్ల ఇంట్లో ఎక్కువగా ఒంటరి జీవితం గడపాల్సి వచ్చేదని, ఎవరితోనూ కలిసేవాడిని కాదని ఆయన చెప్పారు.
Also Read : ఇళయరాజా సంగీతంలో ధనుష్ పాట - కమెడియన్ హీరోగా వస్తున్న సీరియస్ సినిమా కోసం
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే, ఒకానొక సమయంలో తాను కూడా డిప్రెషన్ కు లోనైనట్లు, సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించడం సెన్సేషన్ అని చెప్పాలి. 'అన్‌స్టాపబుల్ 2'లో స్ఫూర్తివంతమైన మాటలు చెప్పారు. ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దని చెప్పారు. మీతో మీరు పోటీ పడమని సలహా ఇచ్చారు. జ్ఞానంతో పాటు విజయం కష్టపడటం వల్ల వస్తుందని తెలిపారు.
ఫిబ్రవరి 10 నుంచి...
పవర్ ఫైనల్ పార్ట్ 2!
కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు... 'అన్‌స్టాపబుల్ 2' పవర్ ఫైనల్ పార్ట్ 2లో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 10 నుంచి 'ఆహా' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆయనతో 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సందడి చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ పార్ట్ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ఆహా వర్గాలు తెలిపాయి.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?