తమిళ స్టార్ ధనుష్ (Dhanush) లో మంచి నటుడు, కథానాయకుడు మాత్రమే కాదు... గాయకుడు, రచయిత, నిర్మాత కూడా ఉన్నారు. ఆయన కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. పాటలు రాశారు, పాడారు. ఇప్పుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతంలో సంగీతంలో ధనుష్ ఓ పాట పాడారు. అదీ ఆయన సినిమా కోసం కాదు... తమిళ కమెడియన్ సూరి కోసం!

  


'విడుతలై'లో ధనుష్ పాట
జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందిస్తున్న తాజా చిత్రం 'విదుతలై'. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో హాస్య నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సూరి (Tamil Comedian Soori) కథానాయకుడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వాతియర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఆయన బాణీ అందించిన ఓ పాటను ధనుష్ పాడారు. 


బుధవారం 'ఓన్ దొణక్కి నాందా' విడుదల
'విడుతలై 1'లో 'ఓన్ దొణక్కి నాందా' అనే పాటను ధనుష్ పాడారు. లేటేస్టుగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇళయరాజా దగ్గరుండి మరీ ధనుష్ చేత పాట పాడించారు. బుధవారం... ఫిబ్రవరి 8న, ఉదయం 11 గంటలకు సాంగ్ విడుదల చేయనున్నారు. 


వెట్రిమారన్ దర్శకుడిగా పరిచయమైన 'పొల్లదావన్'లో ధనుష్ హీరోగా నటించారు. ఆ తర్వాత 'ఆడుకాలమ్', 'వడా చెన్నై', 'అసురన్' సినిమాలు చేశారు. 'కాక ముట్టై' సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. అందువల్ల, ధనుష్ పాట పాడారు. 


Also Read : తారక రత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్ సైలెన్స్ 






ఆర్.ఏస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జైయంట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దీనికి ఎల్‌డ్రెడ్‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం పూర్తి చేశారు. మొత్తం రెండు భాగాలూ తీసేశారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ (Peter Hein) హెయిన్ నేతృత్వంలో భారీ స్థాయిలో ఫైట్స్ తీశారు. సినిమాకు అవి హైలైట్ అవుతాయని టాక్. 


పది కోట్ల విలువ చేసే సెట్స్...
'విడుతలై' కోసం కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో పది కోట్ల రూపాయలు విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ వేశామని నిర్మాతలు తెలిపారు. ఆ మధ్య సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా మరో భారీ సెట్ నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకెనాల్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బల్గేరియా నుంచి వచ్చిన నిష్ణాతులైన స్టంట్  బృందం అందులో పాల్గొంటున్నారు.


Also Read : తెలుగింటి కోడలు కాబోతున్న లావణ్యా త్రిపాఠి - ఆ హీరోతో పెళ్లి! 


విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాశ్ రాజ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'విడుతలై 1',  'విడుతలై 2' విడుదల తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.