Taraka Ratna Health Update : నందమూరి కథానాయకుడు, యువ రాజకీయ నేత తారక రత్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఇటు సినిమా ప్రేక్షకులు, అటు తెలుగు దేశం పార్టీ అభిమానులు, ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన హెల్త్ గురించి ఎన్టీఆర్ నోట వస్తుందని ఆశించారు. అయితే, అటువంటి ఏమీ రాలేదు.


'అమిగోస్'...
ఓన్లీ మూవీస్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'అమిగోస్' (Amigos Pre Release Event) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ అన్నయ్య తారక రత్న గురించి ఎన్టీఆర్ మాట్లాడే అవకాశం ఉందని అందరూ ఆశించారు. కానీ, అలా జరగలేదు. అటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తారక రత్న ఆరోగ్యం గురించి మౌనం వహించారు. సినిమాల గురించి తప్ప మరో టాపిక్ మాట్లాడలేదు. 


సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి అయినప్పుడు మెగా హీరోలు మీడియా ముందుకు వచ్చినప్పుడు మ్యాగ్జిమమ్ హెల్త్ అప్‌డేట్ ఇస్తూ వచ్చారు. సాయి తేజ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతని రిపబ్లిక్ మూవీ విడుదల అయ్యింది. అందువల్ల, ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి వార్తలు వచ్చాయి. తారక రత్నకు వచ్చేసరికి అలా జరగడం లేదు. ఏదో ఒకటి చెప్పి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయడం కూడా నందమూరి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. 


ఇప్పుడు తారక రత్నకు ఎలా ఉంది?
తారక రత్నకు గుండెపోటు వచ్చిన తర్వాత నాలుగైదు రోజులు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. వైసీపీ ఎంపీ, తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి బాబాయ్ విజయ సాయిరెడ్డి  ఆయనకు థాంక్స్ కూడా చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు విజయ సాయిరెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత మరో అప్ డేట్ లేదు. అందువల్ల, తారక రత్నకు ఇప్పుడు ఎలా ఉంది? అనే క్వశ్చన్ వస్తోంది. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... తారక రత్న ఆరోగ్యం గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగు పడింది. అయితే, ఇంకా ఆందోళనకర పరిస్థితి ఉందట. పూర్తిగా నయం కావడానికి మరికొంత సమయం అవసరం అవుతుందట. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు, ప్రజలు కోరుకుంటున్నారు.


Also Read : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!


తారక రత్నకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ తలపెట్టిన 'యువ గళం' పాదయాత్రలో జనవరి 27న పాల్గొనడానికి నందమూరి తారక రత్న కుప్పం వెళ్ళారు. అక్కడ మసీదులోనికి వెళ్ళి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత డీహైడ్రేషన్ కారణంతో సొమ్మసిల్లి పడ్డారని అందరూ భావించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత గుండెపోటు అని తెలిసింది. మెదడుకు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిందని తెలిపారు. తొలుత కుప్పం ఆస్పత్రులలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు.


Also Read : ఎన్టీఆర్ కోపానికి కారణం ఏమిటి? తమిళ హీరోలను చూసి నేర్చుకోవాలా?