పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో మ్యాచో స్టార్ రానా మరో హీరో. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు ఒక సాంగ్ కూడా రాశారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... 'భీమ్లా నాయక్'లో మరో కొత్త పాటను చేరింది.
ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ 'భీమ్లా నాయక్' కోసం ఓ పాట పాడారు. 'ఎల్లమ్మా...' అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. పాట రికార్డింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కైలాష్ ఖేర్, త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫొటోను తమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎల్లమ్మా...' పాటకు ప్రేక్షకులు అడిక్ట్ అవుతారని తమన్ పేర్కొన్నారు.
Also Read: 'భీమ్లా నాయక్' రిలీజ్ ఎప్పుడు? జగన్ గారిని అడగాలంటున్న నిర్మాత నాగవంశీ
పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ గురించి స్పష్టత ఇవ్వనున్నారు. ఏపీలో వందశాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోలకు అనుమతి వస్తే... ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవని సమాచారం. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ అప్‌డేట్...