2022 ఫిబ్రవరి 14 సోమవారం రాశిఫలాలు
మేషంఒకరి విమర్శల వల్ల టెన్షన్ పడతారు. మీరు మీ బంధువులతో సమావేశాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఎలాంటి బాధల నుంచైనా బయటపడే సామర్థ్యం ఉంటుంది. ఎవరో తెలియని వ్యక్తుల వల్ల నష్టపోతారు జాగ్రత్త. వృషభంపనికిరాని విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించకండి. ఈరోజు ఖర్చు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెరుగుతుంది. మీ ప్రవర్తనలో కొంత ఒత్తిడి ఉంటుంది.
మిథునంఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన రోజు. మీ పనికి తెలియని ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎలాంటి కారణం లేకుండా గందరగోళానికి గురవుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. కర్కాటకంఈ రోజు స్నేహితులని కలిసేటప్పుడు వాగ్వాదం జరగవచ్చు. కుటుంబ వాతావరణంలో అశాంతి ఉంటుంది. ఎవరితోనూ తప్పుడు మాటలు మాట్లాడకండి. మాటల్ని అదుపుచేయండి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు.
సింహంమీరు వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. పెద్ద ఒప్పందాలను పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. సంపాదనతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిపై శ్రద్ధ పెట్టాలి. Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...కన్యమీరు అనారోగ్య సంబంధిత సమస్యల కారణంగా బాధపడతారు. కొన్ని విమర్శల వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలకు ప్రణాళిక వేస్తారు. వ్యాపారులు కాస్త కష్టపడితే లాభాలు అందుకుంటారు.
తులఈరోజు ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన వార్త వింటారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. పనికిరాని వాటిపై సమయాన్ని వృథా చేయకండి.
వృశ్చికంఓ పనిపై ప్రయాణం చేయాస్తారు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వొద్దు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. సమయానికి మిత్రులను కలుస్తారు.
ధనుస్సుఎప్పటి నుంచో ఉన్న ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆహారం గురించి అజాగ్రత్తగా ఉండొద్దు. పొట్టకు సంబంధించిన వ్యాధి నుంచి బయటపడతారు. అధిక పని అలసట మరియు ఒత్తిడికి దారి తీస్తుంది.
మకరంఈరోజు మీరు రహస్య శాస్త్రాల అధ్యయనంలో సమయాన్ని వెచ్చించవచ్చు. స్నేహితులతో కలసి పార్టీల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష సమయం గడుపుతారు. రోజంతా బిజీగా ఉంటారు.
కుంభంఈ రోజు ప్రయాణంలో ఓ శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి గురించిన ఆందోళన తొలగిపోతుంది. ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూల సమయం. మీనంస్నేహితులతో కలసి విహారయాత్రకు వెళతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వకండి.
Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి