ఈ సంవత్సరం (2025)లో అనేక సినిమాలు ఓటీటీలో ట్రెండ్ అయ్యాయి. సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ... పలు సినిమాలు థియేటర్లలో కోట్లకు కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టాయ్. బాక్సాఫీస్‌లో బాగా డబ్బులు సంపాదించాయి. అయితే కొన్ని సినిమాలు విడుదల కాకముందే తమ బడ్జెట్‌లో సగానికి పైగా ఓటీటీ డీల్స్ ద్వారా రాబట్టుకుని నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడం విశేషం. థియేటర్ల ద్వారా సినిమాకు లాభం తేవడమే కాకుండా, నాన్ - థియేట్రికల్ హక్కుల రూపంలోనూ కొన్ని సినిమాలు భారీ వ్యాపారం చేశాయి. ఈ సంవత్సరం ఏ సినిమాల ఓటీటీ హక్కులు హయ్యస్ట్ రేటుకు అమ్ముడయ్యాయో తెలుసుకోండి.
సల్మాన్ ఖాన్ 'సికిందర్'సల్మాన్ ఖాన్, రష్మిక నటించిన 'సికిందర్' మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. టాక్ పక్కన పెడితే బాగానే వసూళ్లు సాధించింది. సినిమాపై మొదట్నుంచీ మంచి బజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 85 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని బాలీవుడ్ టాక్. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో 350 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తే, ఆ ఓటీటీ డీల్ విలువ 100 కోట్ల రూపాయలకు చేరేదట.
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ 'ఓజీ'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన 'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25న వెండితెరపై విడుదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ అభిమానులకు ఆయన్ను గ్యాంగ్‌స్టర్ రోల్‌లో చూసే అవకాశం లభించింది. అలాగే, ఇమ్రాన్ హష్మీ సౌత్ డెబ్యూ చూసే అవకాశం లభించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 92 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీతో పాటు ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చే 'జన నాయగన్'ఇలయ థళపతి విజయ్ కెరీర్‌లో 'జన నాయగన్' చివరి సినిమా కానుంది. అయితే, విడుదల కాకముందే ఈ సినిమా వార్తల్లో ఉంటోంది. ఆల్రెడీ నిర్మాతలకు ఓటీటీ హక్కుల రూపంలో భారీ లాభం చేకూర్చిందట. జన నాయగన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
రజనీకాంత్ 'కూలీ' రైట్స్ ఏమీ తక్కువ కాదుసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు సాధించింది. మరోసారి రజనీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందింది. డిజిటల్ హక్కుల విషయానికొస్తే, 'కూలీ'ని ప్రైమ్ వీడియో 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
హందీలో రణవీర్ సింగ్ 'ధురందర్'ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ సినిమా 'ధురంధర్'. ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఓటీటీ డీల్ ద్వారా భారీ లాభం వచ్చిందట. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను 285 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సంవత్సరం ఓటీటీలో అత్యధిక ధరకు అమ్ముడైన సినిమాగా ఇది నిలిచింది.