'టైటానిక్' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాను తీసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జేమ్స్ కామెరూన్ తీసిన తాజా సినిమా 'అవతార్ ఫైర్ అండ్ యాష్'. ఈ రోజు విడుదలైంది. యాదృచ్చికం ఏమిటంటే... 28 ఏళ్ల క్రితం ఇదే రోజున, అంటే డిసెంబర్ 19న లియోనార్డో డికాప్రియో 'టైటానిక్' విడుదలైంది. ఇప్పుడు 'అవతార్' ఫ్రాంచైజీలోని మూడవ చిత్రం విడుదలైంది.
డిసెంబర్‌లో విడుదలైన ఇండియన్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. హిందీలో రణవీర్ సింగ్ 'ధురందర్', తెలుగులో నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నా... హాలీవుడ్ సినిమా 'అవతార్ 3' మొదటి రోజే చరిత్ర సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది.
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్
బాలీవుడ్ ట్రేడ్ పోర్టల్ కొయిమోయి అంచనాల ప్రకారం... ఈ సినిమా ఓపెనింగ్ డే 20 - 22 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించవచ్చు. కొద్దిసేపట్లో ఇది నిజానికి ఎంత దగ్గరగా ఉందో స్పష్టమవుతుంది. శుక్రవారం (ఓపెనింగ్ రోజు) మధ్యాహ్నం 3:10 గంటల వరకు 6.62 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. సెక్నిల్క్‌లో అందుబాటులో ఉన్న ఈ డేటా ఇది. ఇంకా ఖరారు కాలేదు. రాత్రికి మారుతుంది.
ఇండియాలో ఈ ఏడాది హయ్యస్ట్ ఓపెనింగ్...హాలీవుడ్ సినిమాల్లో 'అవతార్ 3' రికార్డుల మోత!
'అవతార్ 3' సినిమా విడుదలై కొన్ని గంటలు మాత్రమే అయ్యింది. అయితే, ఈ సంవత్సరం ఇండియాలో అతి పెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డును సృష్టించడానికి రెడీ అవుతోవది. ఈ ఏడాది (2025లో) భారతదేశంలో విడుదలైన టాప్ 10హాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్‌లను అధిగమించనుంది.
ఈ జాబితాలో మొదట టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' ఉంది, ఇది సెక్నిల్క్ ప్రకారం 11 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది, ఇది ఇప్పుడు బద్దలు కానుంది.
'అవతార్ ఫైర్ అండ్ యాష్' గురించి...
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన 'అవతార్'కు సంబంధించిన ఇటీవల విడుదలైన మూడవ భాగానికి ఏబీపీ దేశం తన రివ్యూలో 3 స్టార్స్ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ ఉన్న సినిమా అని పేర్కొంది. రివ్యూలో సినిమా నిడివి ఎక్కువ అని పేర్కొన్నారు.
lso Read: 'అవతార్ 2' సినిమా వెంకటేష్ 'నారప్ప'లా ఉందని ఎందుకు చెప్పారంటే?