Why Pawan Kalyan Gifted Land Rover To OG Director Sujeeth : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్‌గా 'OG' డైరెక్టర్ సుజీత్‌కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన అభిమాన హీరోతో బ్లాక్ బస్టర్ తీసినందుకే ఈ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారని అంతా భావించారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది.
అసలు రీజన్ ఏంటంటే?
ఓ సగటు పవర్ స్టార్ అభిమాని పవన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూడాలని అనుకున్నాడో... ఓ వీరాభిమానిగా అలానే 'OG'లో చూపించారు డైరెక్టర్ సుజీత్. సినిమాలో పవన్ యాక్షన్, జోష్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. బాక్సాఫీస్ బరిలో ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇంతటి సక్సెస్ అందించినందుకే డైరెక్టర్‌కు పవన్ ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చారని అంతా అనుకున్నారు. కానీ, అసలు కారణం అది కాదు.
'OG' షూటింగ్ చివరి దశలో ఓ కీలకమైన షెడ్యూల్ జపాన్‌లో షూట్ చేయాల్సి వచ్చింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా చిత్ర నిర్మాణ సంస్థకు ఈ షెడ్యూల్ చేయడం సాధ్యపడలేదు. అయితే, జపాన్‌లో ఆ సీన్స్ తీస్తేనే 'OG' మూవీకి కంప్లీట్‌నెస్ వస్తుందని డైరెక్టర్ సుజీత్ భావించాడు. ఈ క్రమంలో బడ్జెట్ కోసం తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో జపాన్‌కు వెళ్లి అవసరమైన లొకేషన్స్ షూట్ చేసుకుని వచ్చాడు.
డెడికేషన్ మెచ్చిన పవన్
ఇక, డబ్బింగ్ దశలో పవన్ కల్యాణ్‌కు డైరెక్టర్ సుజీత్ ఇలా చేసినట్లు తెలిసింది. సినిమా పట్ల డైరెక్టర్ సుజీత్‌కు ఉన్న అంకితభావం, ఇష్టం, బాధ్యత, డెడికేషన్ పవర్ స్టార్‌ను ఆకట్టుకున్నాయి. సినిమా కోసం తన సొంత వెహికల్‌నే అమ్మేసిన విషయం తెలుసుకున్న పవన్... అదే మోడల్, ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను డైరెక్టర్‌కు గిఫ్ట్‌గా అందించారు. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు అని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ 'దటీజ్ పవన్ కల్యాణ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 'ధురంధర్' ఓటీటీ బిగ్ డీల్ - 'పుష్ప 2'ను దాటేసిందా!... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
సుజీత్ రియాక్షన్
పవన్ తనకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని స్వయంగా డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీనికి సంబంధించి 3 ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. 'మాటలకు అందని అద్భుతమైన సందర్భం ఇది. ఇప్పటివరకూ అందుకున్న బహుమతుల్లో ఇదే బెస్ట్ గిఫ్ట్. నాకు ఎంతో ఇష్టమైన పవన్ కల్యాణ్ గారి నుంచి లభించిన ప్రేమను మాటల్లో చెప్పలేను. నా చైల్డ్ హుడ్ డేస్ ఆయన అభిమాని నుంచి ఇప్పటివరకూ ప్రతిదీ ఎంతో స్పెషల్ మూమెంట్. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను.' అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు 'OG' సీక్వెల్, ఫ్రీక్వెల్ ఉంటాయని ముందే అనౌన్స్ చేశారు. 'OG' సీక్వెల్ సిద్ధం చేసే పనిలో సుజీత్ ఉన్నారు.