Ranveer Singh's Dhurandhar OTT Release Date : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Continues below advertisement

బిగ్ ఓటీటీ డీల్

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' దాదాపు రూ.285 కోట్లతో డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఓటీటీ డీల్ కంటే ఇది అత్యధికం అంటూ ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే షాకింగ్ డీల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అంతకు ముందు 'ధురంధర్' 2 పార్టులకు కూడా కలిపి రూ.130 కోట్లకు పైగా 'నెట్‌ఫ్లిక్స్‌'తోనే డీల్ జరిగిందనే ప్రచారం కూడా సాగింది. 

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ప్రస్తుతం 'ధురంధర్' మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే, మూవీ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి చివరి వారం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్‍లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో పాటు మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్,  అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read : మరో ఓటీటీలోకి 'లిటిల్ హార్ట్స్', 90s, AIR వెబ్ సిరీస్‌లు - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

1999లో జరిగిన ఐసీ 814 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనల తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) దాయాది దేేశంలో ఉగ్ర సంస్థల విధ్వంసానికి ఓ కీలక డెసిషన్ తీసుకుంటాడు. పాక్‌ను చావు దెబ్బ కొట్టడ సహా అక్కడ ఉగ్ర సంస్థల్ని పూర్తిగా అంతం చేసేందుకు 'ధురంధర్' పేరుతో ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. ఇందులో భాగంగా పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న యువకుడిని భారత ఏజెంట్‌గా హమ్జా (రణవీర్ సింగ్) పేరుతో ఆ దేశంలోకి పంపుతాడు.

శత్రు దేశంలోకి సీక్రెట్ ఏజెంట్‌గా వెళ్లిన హమ్జాకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? కరాచీ అడ్డాగా ఉగ్ర ముఠాల్ని తయారు చేస్తోన్న రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ను హమ్జా ఎలా అంతం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.