Vikranth's Santhana Prapthirasthu Movie OTT Release Date : రీసెంట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంతాన ప్రాప్తిరస్తు' ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి రానుంది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో సంజీవ్ రెడ్డి మూవీకి రూపొందించారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీలు 'అమెజాన్ ప్రైమ్ వీడియో', 'జియో హాట్ స్టార్'లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మూవీలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి, ఆమని, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యమ్ మ్యూజిక్ అందించారు.
Also Read : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
స్టోరీ ఏంటంటే?
హైదరాబాద్‌లో చైతన్య (విక్రాంత్) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా వర్క్ చేస్తుంటాడు. చిన్నప్పుడే పేరెంట్స్‌ను కోల్పోయిన అతను హైదరాబాద్‌లో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు తన స్నేహితుడు సుబ్బు (అభినవ్ గోమటం)ను ఎగ్జామ్ సెంటర్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లి కల్యాణి (చాందిని చౌదరి)ని చూసి లవ్‌లో పడతాడు. చైతన్య వ్యక్తిత్వం నచ్చిన ఆమె కూడా ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమై కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్)ను ఒప్పించేందుకు ఆమె సొంతూరు వరంగల్ వెళ్తాడు.
అయితే, వీరి పెళ్లికి కల్యాణి తండ్రి ఒప్పుకోడు. దీంతో ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఓ బిడ్డను కంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చైతన్య అనుకుంటాడు. అయితే, పిల్లల విషయంలో ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. అసలు చైతన్యకు ఉన్న సమస్య ఏంటి? తన మామకు చైతన్యకు ఉన్న సవాల్ ఏంటి? చివరకు ఈ దంపతులు పేరెంట్స్ కాగలిగారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.