Nidhhi Agerwal Manhandled By Fans In Hyderabad : హీరోయిన్ నిధి అగర్వాల్‌కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. 'ది రాజా సాబ్' సహానా సహానా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొనగా ఫ్యాన్స్ తీవ్ర అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక్కసారిగా ఆమె వద్దకు రాగా బాడీగార్డులు అతి కష్టం మీద ఆమెను కార్ ఎక్కించారు.

Continues below advertisement

హీరోయిన్ తీవ్ర అసహనం

ఫ్యాన్స్ హీరోయిన్ నిధిని ఒక్కసారిగా చుట్టుముట్టేయగా ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాడీగార్డులు వారిని నిలువరిస్తున్నా వెనక్కు తగ్గలేదు. కొంతమంది ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చివరకు అందరినీ నెట్టి బాడీగార్డులు ఆమెను అతి కష్టం మీద కారు ఎక్కించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ నిధి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు సైతం ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు.

Continues below advertisement

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈవెంట్ నిర్వాహకులు సరిగ్గా ప్లాన్ చేయలేదని... అందుకే ఇలాంటి ఘటన జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ వచ్చినప్పుడు ముందుగానే సెక్యూరిటీ, బౌన్సర్లను అరేంజ్ చేసుకోవాలని ఇకపై ఇలా జరగకుండా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు. 

Also Read : చేతులు జోడించి మొక్కుతున్నా... ఏఐ చెత్తకు సపోర్ట్ చేయకండి - శ్రీ లీల ఎమోషనల్ పోస్ట్!

 

మారుతి డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతోన్న హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్'. ఫస్ట్ టైం ప్రభాస్ ఇలాంటి జానర్‌లో నటిస్తుండడం, వింటేజ్ లుక్ అదిరిపోవడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. డార్లింగ్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటే సప్తగిరి, వీటీవీ గణేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మూవీపై పదింతలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.