'అఖండ 2 తాండవం'తో పాటు థియేటర్లలోకి రావాల్సిన సినిమా 'అన్నగారు వస్తారు'. కోలీవుడ్ స్టార్ కార్తీ కథానాయకుడిగా రూపొందిన 'వా వాతియార్' చిత్రానికి తెలుగు అనువాదం ఇది. అయితే చివరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. నిజానికి డిసెంబర్ 5న సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే 'అఖండ 2' ఉండడంతో డిసెంబర్ 12కు సినిమా వచ్చింది. చివరకు ఆరోజు కూడా విడుదల కాలేదు. కారణం ఏమిటి? అని ఆరా తీస్తే... ఫైనాన్సర్లకు డబ్బులు క్లియర్ చేయలేదని తెలిసింది. దాంతో చివరి నిమిషంలో రిలీజ్ క్యాన్సిల్ అయింది. అందువల్ల ఇప్పుడు మరొక ముప్పు వచ్చి పడింది.
డేంజర్‌లో 'అన్నగారు వస్తారు' ఓటీటీ డీల్!
సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఓటీటీ సంస్థల ప్రమేయం ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు విడుదల తేదీలను ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ తేదీలను బట్టి థియేట్రికల్ రిలీజ్ డేట్స్ డిసైడ్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నగారు వస్తారు విడుదల వాయిదా పడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కొన్ని కండిషన్స్ పెట్టిందని టాక్. తాము ముందుగా ఆఫర్ చేసిన అమౌంట్ ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పిందట. అందువల్ల డీల్ రీ రైట్ చేస్తున్నారని తెలిసింది.
క్రిస్మస్ లేదా సంక్రాంతికి అన్నగారు వస్తారా?
డిసెంబర్ 12 నుంచి వాయిదా పడిన అన్నగారు వస్తారు సినిమాను క్రిస్మస్ లేదా సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్తీ సరసన కృతి శెట్టి నటించిన ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకం మీద కార్తీ కజిన్, ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు సూర్య, కార్తీలతో పలు హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సూర్య 'కంగువ' ప్రొడ్యూసర్ కూడా ఆయనే.