జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో శ్రీలీల కెరీర్ దూసుకు వెళుతోంది‌. ఫ్లాపులు వచ్చినప్పటికీ... స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు దక్కుతోంది. మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా... నెక్స్ట్ ఆవిడ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. వచ్చే ఏడాది ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగు సంగతి పక్కన పెడితే... సంక్రాంతికి తమిళ తెరపై అడుగు పెట్టడానికి శ్రీ లీల రెడీ అవుతోంది. ఆ సినిమా పేరు 'పరాశక్తి'. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఆ చిత్రానికి బంపర్ ఆఫర్ తగిలింది.

Continues below advertisement

పరాశక్తి ఓటీటీ డీల్ క్లోజ్...రూ. 52 కోట్లు ఇచ్చిన జీ5!శివ కార్తికేయన్ కథానాయకుడిగా 'గురు', 'ఆకాశమే నీ హద్దురా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పరాశక్తి'. ఇందులో జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్వర్క్ జీ 5 సొంతం చేసుకుంది. అది కూడా 52 కోట్ల రూపాయలకు.

Also ReadMowgli 2025 Review - 'మోగ్లీ 2025' రివ్యూ: 'కలర్ ఫోటో' దర్శకుడి కొత్త సినిమా - సుమ కనకాల తనయుడు రోషన్‌కు హిట్ వస్తుందా?

Continues below advertisement

తమిళంలో రూపొందిన 'పరాశక్తి' సినిమాను తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. హీరో శివ కార్తికేయన్ గత సినిమాలో తెలుగులో విజయాలు సాధించాయి. ఆయనకు ఇక్కడ కొంత మార్కెట్ ఉంది. దానికి తోడు తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీ లీల సినిమాలో నటిస్తోంది. అందువల్ల 'పరాశక్తి' సినిమాకు ఓటీటీ రైట్స్ రూపంలో మంచి అమౌంట్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

Also Read3 Roses Season 2 Review - '3 రోజెస్ సీజన్ 2' రివ్యూ: రొమాంటిక్ కామెడీ & రివేంజ్‌తో కూడిన కథ... AHA OTTలో సిరీస్ ఎలా ఉందంటే?

హిస్టారికల్ పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'పరాశక్తి' సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు ఆయన పని చేశారు.