3 Roses Season 2 Review - '3 రోజెస్ సీజన్ 2' రివ్యూ: రొమాంటిక్ కామెడీ & రివేంజ్‌తో కూడిన కథ... AHA OTTలో సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - 3 Roses Season 2 On Aha Video: ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషితా కల్లపు నటించిన వెబ్ సిరీస్ '3 రోజెస్ సీజన్ 2'. ఆహా ఓటీటీలో 4 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీజన్ 2 ఎలా ఉందంటే?
కిరణ్ కె కరవల్ల
ఈషా రెబ్బా, సూర్య శ్రీనివాస్, సత్య, హర్ష చెముడు, కుషిత కల్లపు, ప్రభాస్ శ్రీను తదితరులు
AHA OTT
Eesha Rebba's 3 Roses S2 Telugu Review: ఆహా ఓటీటీలో ఆల్మోస్ట్ మూడేళ్ళ క్రితం '3 రోజెస్' వెబ్ సిరీస్ వచ్చింది. అందులో ఈషా రెబ్బా, హర్ష చెముడుతో పాటు మిగతా వాళ్ళు చేసిన వినోదం అందరికీ నచ్చింది. ఇప్పుడు ఆ సిరీస్ సీక్వెల్ '3 రోజెస్ సీజన్ 2' వచ్చింది. దీనికి మారుతి షో రన్నర్. ఇందులో ఈషా రెబ్బా, హర్ష చెముడుకు తోడు కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చాయి. సూర్య శ్రీనివాస్ హీరోగా నటించారు. రాశీ సింగ్, కుషితా కల్లపు, 'ప్రభాస్' శ్రీను, సత్య, సుదర్శన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సిరీస్ మొదటి నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?
కథ (3 Roses Season 2 Story): ముంబైలో రీతూ అలియాస్ రిత్విక (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్)తీసుకుంది , సృష్టి (కుషితా కల్లపు) ఫ్లాట్‌మేట్స్. ముగ్గురూ కలిసి యాడ్ ఏజెన్సీ కంపెనీ మొదలు పెడతారు. తాను 'ప్ర జ్యువెలర్స్' ఓనర్ అని, తనకు యాడ్ చేసి ఇవ్వాలని రీతూ రిజెక్ట్ చేసిన ప్రసాద్ (హర్ష చెముడు) వస్తాడు. ఆ యాడ్ చేయడానికి వచ్చిన మోడల్ కాలేజీలో రీతూ రిజెక్ట్ చేసిన అబ్బాయి (సూర్య శ్రీనివాస్).
రీతూ రిజెక్ట్ చేసిన ఇద్దరు అబ్బాయిలు ఏం చేశారు? నెల నెల భరణం ఇవ్వడానికి వచ్చే మాజీ భర్త భోగి (సత్య)తో మేఘన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది? జెన్ జి కిడ్, కొరియన్ డ్రామా పిచ్చిలో సృష్టి ఏం చేసింది? సమస్యల నుంచి ముగ్గురూ ఎలా గట్టెక్కారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (3 Roses Season 2 Review Telugu): '3 రోజెస్' ఫస్ట్ సీజన్ సక్సెస్ వెనుక ఉన్నది అందులో కామెడీ. కథ కంటే క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లు ప్రవర్తించే విధానం వల్ల ఏర్పడిన సందర్భాల నుంచి వచ్చే వినోదం వీక్షకులకు నచ్చింది. ముఖ్యంగా ఈషా రెబ్బా, హర్ష చెముడు ట్రాక్ నవ్వించింది. సీజన్ 2లోనూ వినోదానికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు.
'3 రోజెస్ సీజన్ 2'లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయ్. అయితే... ప్రస్తుతానికి నాలుగు మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ నాలుగులోనూ మొదటి ఎపిసోడ్ కొత్త క్యారెక్టర్స్ పరిచయానికి సరిపోయింది. ఇంట్రడక్షన్ అయినా సరే ప్రజెంట్ స్టార్ కమెడియన్ సత్య తనదైన టైమింగ్ & నటనతో నవ్వించారు. ఆయన వినోదం ముందు రాశి ఖన్నా గ్లామర్ సైడ్ అయ్యింది. ఆ తర్వాత కథలోకి వెళితే... యాడ్ పేరుతో ఈషా రెబ్బా మీద హర్ష చెముడు రివేంజ్ తీసుకోవడం బావుంది. జెన్ జి కిడ్స్ కనెక్ట్ అయ్యేలా కుషిత క్యారెక్టర్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ, మొహం మధ్య వ్యత్యాసం తెలుసుకోలేక ఎలా మోసపోతున్నారు? అనేది చూపించిన తీరు బావుంది.
'3 రోజెస్ సీజన్ 2'లోనూ కామెడీ బావుంది. అయితే కథ పరంగా కొత్తదనం కానీ, ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అయ్యే ట్విస్టులు గానీ లేవు. 'ప్రభాస్' శ్రీను కామెడీ అందరూ ఎంజాయ్ చేసేలా లేదు. కాస్త వల్గారిటీతో కూడిన సీన్స్ అవి. అజయ్ అరసాడ సంగీతం, కిరణ్ కె కరవల్ల దర్శకత్వం, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ, ఎస్‌కేఎన్ ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సింపుల్ కథతో తీశారు. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. ప్రస్తుతానికి 4 ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి కనుక మిగతా ఎపిసోడ్స్‌లో కథ మలుపులు తిరుగుతుంది ఏమో చూడాలి.
ఈషా రెబ్బా ఎప్పటిలా చేశారు. రీతూగా ఆమె నటనలో సహజత్వం ఉంది. రాశి సింగ్, కుషితా కల్లపు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. గ్లామర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. హ్యాండ్సమ్ లుక్స్, చక్కటి నటనతో సూర్య శ్రీనివాస్ ఇంప్రెస్ చేస్తారు. ఇనయా సుల్తానా క్యారెక్టర్ బరస్ట్ అయ్యే సీన్ బావుంది. సుదర్శన్ కనిపించేది రెండు మూడు సన్నివేశాలే అయినా నవ్వించారు.
వినోదానికి లోటు లేని సిరీస్ '3 రోజెస్ సీజన్ 2'. మొదటి నాలుగు ఎపిసోడ్స్‌లో హాయిగా నవ్వుకునే మూమెంట్స్ ఉన్నాయి. వీకెండ్ ఓటీటీలో హ్యాపీగా చూడవచ్చు. ఇంట్లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?