Ram Charan Speech In Champion Trailer Launch Event : 'ఛాంపియన్' ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఓరియెంటెడ్ 'లగాన్'లా ఉందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన తన ఫస్ట్ మూవీ ఛాన్స్ దగ్గర నుంచీ వైజయంతీ మూవీస్‌తో తనకున్న అనుబంధంతో పాటు 'పెద్ది'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నాకు 'మగధీర'... రోషన్‌కు 'ఛాంపియన్'
తనకు 'మగధీర' ఎంత హిట్ అయ్యిందో... రోషన్‌కు 'ఛాంపియన్' అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చరణ్ తెలిపారు. 'మూవీ పోస్టర్‌లో రోషన్‌ను చూస్తుంటే యురోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. 1938 కాలంలో జరిగిన స్టోరీ ఇది. టీజర్‌లో రెండు మూడు క్లిప్స్ చూసినప్పుడే నటుడిగా రోషన్‌లో పరిణతి కనిపించింది. డైరెక్టర్ ప్రదీప్ వల్లే ఇలాంటి నటన సాధ్యమైంది. ఈ చిత్రంతో మూడున్నరేళ్లు ప్రయాణించానని రోషన్ చెప్పాడు. 'ఛాంపియన్' ఓ యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్.' అని తెలిపారు.
'అయినా ఛాన్స్ ఇచ్చారు'
ఫస్ట్ మూవీ టైంలో మేము యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా నిర్మాత అశ్వనీదత్ ఛాన్స్ ఇచ్చారని చరణ్ తెలిపారు. 'గంగోత్రితో అల్లు అర్జున్, 'రాజకుమారుడు'తో మహేష్ బాబు, 'చిరుత'తో నన్ను హీరోగా పరిచయం చేశారు. మాది సినీ నేపథ్యం కుటుంబమే అయినా యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు. 'వైజయంతీ మూవీస్' అంటేనే బ్లాక్ బస్టర్స్. ఆయన వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కంటిన్యూ చేస్తున్నారు. అవకాశమిస్తే ఈ బ్యానర్‌లో మళ్లీ నటించాలనుకుంటున్నా. ఫ్యాషన్ ఉన్న వారితో వర్క్ చేస్తే నా పని సులువు అవుతుంది.' అని అన్నారు.
'పెద్ది' గురించి
అలాగే, 'పెద్ది' మూవీ అప్డేట్ గురించి ప్రశ్నించగా నవ్వుతూనే సమాధానాన్ని దాటవేశారు. 'పెద్ది షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఛాంపియన్ ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు దాని తర్వాత ఒక్కొక్కటిగా అప్డేట్స్ వస్తాయి.' అంటూ చెప్పారు.
Also Read : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
'తెలుగు వారి చరిత్ర'
తాను చాలా ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నానని... ఇది తెలుగు వారి చరిత్ర అని హీరో రోషన్ అన్నారు. 'ఛాంపియన్' బైరాన్పల్లి ఊరి వారి చరిత్ర అని... తనకు ఈ సినిమాను... మైఖేల్ విలియమ్స్ పాత్రను ఇచ్చినందుకు డైరెక్టర్ ప్రదీప్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్, ప్రదీప్ అద్వైతం, అనస్వర, సంతోష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
25న రిలీజ్
'ఛాంపియన్' మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా... అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. నందమూరి కల్యాణ్ చక్రవర్తి, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.