జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, స్టంట్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, అలాగే మన భారత దేశంలో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. సుమారు 10 రోజుల క్రితం బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఇండియాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు మన దేశంలో హాలీవుడ్ మూవీస్ టాప్ 10 డే రికార్డులు తెలుసా?
ఇండియాలో 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఓపెనింగ్ ఎంత?కొయిమోయి నివేదిక ప్రకారం... 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అభిమానులు వెండితెరపై సినిమాను చూడటానికి ఉత్సాహం చూపించారు. ఈ సినిమా క్రేజ్ పరిగణనలోకి తీసుకుంటే... మొదటి రోజు భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 18 - 22 కోట్ల నెట్ సంపాదించవచ్చు. అయితే, ఈ సినిమాను అవతార్ ఫ్రాంఛైజీలో మొదటి సినిమాతో కంపేర్ చేస్తే... 30 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుందని అంచనా వేయబడింది. ఇది 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' 41 కోట్ల కంటే చాలా తక్కువ.
'అవతార్ 3'తో రికార్డులు బద్దలే'అవతార్: ఫైర్ అండ్ యాష్' కలెక్షన్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక కొత్త మైల్ స్టోన్ క్రియేట్ చేయగలదు. ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ తీసుకునే హాలీవుడ్ చిత్రం కానుంది. అంతే కాదు... ఇది టాప్ 10 హాలీవుడ్ చిత్రాలను అధిగమించనుంది.
2025లో టాప్ 10 హాలీవుడ్ చిత్రాలు (ఓపెనింగ్ డే కలెక్షన్) ఇక్కడ చూడండి
- మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ - 11 కోట్లు
- ది కాంజూరింగ్: లాస్ట్ రైట్స్ - 10 కోట్లు
- సూపర్‌మ్యాన్ (3D)- 5.15 కోట్లు
- F1- 5 కోట్లు
- జురాసిక్ వరల్డ్ రిబర్త్- 4.9 కోట్లు
- ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - 4 కోట్లు
- థండర్‌బోల్ట్స్ (3D)- 2.65 కోట్లు
- ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్- 2.5 కోట్లు
- డెమోన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కాజిల్- 2.4 కోట్లు
- కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్- 2.1 కోట్లు