బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'మిస్సెస్ దేశ్‌పాండే'. దీనితో డిజిటల్ స్పేస్‌లోకి ఆమె తిరిగి వస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒకప్పటి అందాల కథానాయిక సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 19న) రాత్రి ఓటీటీలో విడుదల కానుందీ 'మిస్సెస్ దేశ్‌పాండే'. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ఎక్కడ చూడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం?

Continues below advertisement

ఏ ఓటీటీలో 'మిస్సెస్ దేశ్‌పాండే'ను చూడాలి?Where to watch Mrs Deshpande online: సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'మిస్సెస్ దేశ్‌పాండే' రూపొందింది. డిసెంబర్ 19, 2025 అర్ధరాత్రి జియో హాట్‌ స్టార్‌ ఓటీటీలో ఫుల్ హెచ్‌డీలో అందుబాటులో ఉంటుందీ సిరీస్. రాత్రి 12 గంటల నుండి సిరీస్‌ను చూడటం ప్రారంభించవచ్చు. ఈ షోకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఫ్రెంచ్ మినీ సిరీస్ 'లా మాంటే' అఫీషియల్ రీమేక్ ఇది. దానిని అలిస్ చెగ్రే - బ్రెగ్నోట్, నికోలస్ జీన్, గ్రెగోయిర్ డెమైసన్ రూపొందించారు.

'మిస్సెస్ దేశ్‌పాండే'లో ఎపిసోడ్‌లు ఎన్ని?'మిస్సెస్ దేశ్‌పాండే'లో ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. అన్ని ఎపిసోడ్‌లు ఒకేసారి విడుదల అవుతాయి. బాలీవుడ్ దిగ్గజ నటిని డార్క్, బహుముఖ పాత్రలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని ఈ సిరీస్ అందిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో మాధురి దీక్షిత్‌తో పాటు, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాన్షు ఛటర్జీ, దీక్షా జునేజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Continues below advertisement

Also ReadAvatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?

మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి మాధురి రీ ఎంట్రీ'మిస్సెస్ దేశ్‌పాండే'తో మాధురి దీక్షిత్ మూడు సంవత్సరాల తర్వాత ఓటీటీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె చివరిసారిగా 2022లో 'ది ఫేమ్ గేమ్'లో కనిపించారు. అంతకు ముందు 'భూల్ భులయ్యా 3'తో వెండితెరపై కనిపించారు. ఈ సిరీస్‌తో మాధురి తన సినిమా ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన పాత్రలోకి అడుగుపెడుతున్నారు.

మిస్సెస్ దేశ్‌పాండే సిరీస్ కథ ఏమిటి?'మిస్సెస్ దేశ్‌పాండే' సిరీస్‌ కథ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ (మాధురి దీక్షిత్ పోషించిన పాత్ర) చుట్టూ తిరుగుతుంది. ఒక నకిలీ హంతకుడు ఆమె చేసిన నేరాలను ఫాలో అవ్వడం ప్రారంభించినప్పుడు, పోలీసులు ఆమె సహాయం కోరతారు. అందుకు ఆమె అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

Also Read: Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?