Upcoming Telugu Movies In Theaters OTT Releases In July Last Week: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మాస్ మూవీస్ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకూ ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. అటు, ఓటీటీల్లోనూ పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'
యంగ్ హీరో విజయ్ దేవరకొండ అవెయిటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్‌డమ్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సినిమాలో విజయ్ ఇదివరకు ఎన్నడూ లేని డిఫరెంట్ రోల్‌లో అండర్ కవర్ స్పైగా కనిపించనున్నారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్యతో పాటు సూర్యదేవర నాగవంశీ మూవీని నిర్మించారు.
రియల్ స్టోరీ ఆధారంగా... 'ఉసురే'
వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఉసురే'. టీజై అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నటించారు. ఈ మూవీని నవీన్ డి గోపాల్ తెరకెక్కించగా... మౌళి ఎం.రాధాకృష్ణ నిర్మించారు. రాశి కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 1న మూవీ థియేటర్లలోకి రానుండగా... ఈ చిత్రం అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుందని మూవీ టీం తెలిపింది.
కపుల్ మధ్య చిలిపి తగాదాలు... 'సార్ మేడమ్'
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తలైవన్ తలైవి'. ఈ సినిమాను 'సార్ మేడమ్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు మేకర్స్. ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలను కామెడీగా తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. పాండిరాజ్ దర్శకత్వం వహించగా... టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సన్నాఫ్ సర్దార్ సీక్వెల్
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'సన్నాఫ్ సర్దార్ 2'. 'సన్నాఫ్ సర్దార్' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 25నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆగస్ట్ 1న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కుమార్ అరోరా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
ఓటీటీల్లో వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
- జియో హాట్ స్టార్ - క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ2 (వెబ్ సిరీస్ - జులై 29), పతీ పత్నీ ఔర్ పంగా (వెబ్ సిరీస్ - ఆగస్ట్ 2)
- నెట్ ఫ్లిక్స్ - గ్లాస్ హార్ట్ (వెబ్ సిరీస్ - జులై 31), తమ్ముడు (ఆగస్ట్ 1)
- యాపిల్ టీవీ - చీఫ్ ఆఫ్ వార్ (వెబ్ సిరీస్ - ఆగస్ట్ 1).