Sathya Raj's Tribhanadhari Barbarik Movie OTT Release Date Locked: సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ టచ్ హారర్ థ్రిల్లర్ 'త్రిబాణధారి బార్బరిక్'. డిఫరెంట్ టైటిల్‍తో ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (SunNXT) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకోగా... ఈ నెల 10 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ప్రేమ, నష్టం, విడదీయరాని బంధం - తన మనవరాలిని కొనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ మూవీలో సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలు పోషించారు. డాక్టర్ శ్యామ్‌గా సత్యరాజ్, చాలా రోజుల తర్వాత విలన్ రోల్‌లో రీఎంట్రీ ఇచ్చారు ఉదయభాను. వీరితో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా... స్టార్ డైెరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి నిర్మించారు.
Also Read: పవన్ 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది... యూట్యూబ్‌లో నేహా శెట్టి 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' రిలీజ్
స్టోరీ ఏంటంటే?
శ్యామ్ కతు (సత్యరాజ్) ఓ పేరొందిన సైక్రియాట్రిస్ట్. కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవరాలు నిధి (మేఘన)ను అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఓ రోజు స్కూల్‌కు వెళ్లిన పాప కనిపించకుండా పోతుంది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడతాయి. నిధి మిస్సింగ్ కేసుకు లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) మేనల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)కు సంబంధం ఏంటి? అసలు లేడీ డాన్ పద్మ చేసే అక్రమాలు ఏంటి? తన మనవరాలిని శ్యామ్ ఎలా వెతికి పట్టుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.