Mirai ott release date streaming platform details: 'హను - మాన్' తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన సినిమా 'మిరాయ్'. ఇందులో విలన్ బ్లాక్ స్వార్డ్ పాత్రలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. విమర్శకులతో పాటు ప్రేక్షకులను సైతం మెప్పించిన చిత్రమిది. ఈ నెలలో ఓటీటీలోకి రానుంది. మరి 'మిరాయ్' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో తెలుసా?
అక్టోబర్ రెండో వారంలో 'మిరాయ్' ఓటీటీ ఎంట్రీ!Mirai digital streaming date: 'మిరాయ్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అక్టోబర్ రెండో వారంలో... అదీ 10వ తేదీ నుంచి ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
'మిరాయ్' పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అయితే... ఇప్పుడు ఓటీటీలోకి హిందీ వెర్షన్ రావడం లేదు. కేవలం దక్షిణాది నాలుగు భాషలు - తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!
'మిరాయ్' హిందీ స్ట్రీమింగ్ ఎందుకు లేట్ అవుతోంది?Why Mirai Hindi Version OTT Release Delayed? 'మిరాయ్'ను సెప్టెంబర్ 12న రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తోంది. హిందీలో పీవీఆర్ - ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు సినిమాను రిలీజ్ చేయాలంటే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని కండిషన్ పెడతాయి. అందుకే 'మిరాయ్' హిందీ వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్ చేయడం లేదు. వచ్చే నెలలో ఓటీటీలోకి తీసుకు వస్తారు.
'మిరాయ్' సినిమాలో తేజా సజ్జా సరసన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటించింది. హీరో తల్లిగా సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ కీలక పాత్ర పోషించారు. జగపతి బాబు, జయరామ్, 'గెటప్' శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు.