IBomma Controversy : నాలుగైదు రోజులుగా IBomma  విపరీతమైన ట్రెండింగ్‌లో ఉంది. ఐ బొమ్మ పైరసీ సైట్‌ను మూసేస్తే.. అందరి బండారం బయటపెడతామంటూ ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక టెంప్లేట్ తిరుగుతోంది. పెద్ద సినిమాల దోపిడీని అడ్డుకోవడానికే IBomma ఉంంది అనే తరహాలో ఆ నోట్ ఉంది. ఆ నోట్ నిజమైందా.. ఇప్పటిదా కాదా అని వెరిఫై చేయకముందే బాగా వైరల్ అయింది. అయితే IBomma పేరుతో ఉన్న నోట్‌లో విషయాలు సరైనవి కావని.. వాళ్ల వల్ల చిన్న సినిమాలే నష్టపోతున్నాయని యాక్టర్, నిర్మాత బోసు కంచర్ల రిటార్ట్ ఇచ్చారు. గద్దర్ నా ఓటు 2000 సినిమా లీడ్ యాక్టర్, నిర్మాత అయిన బోసు..  IBomma వల్ల నష్టపోయేది చిన్న సినిమాలే అన్నారు.

Continues below advertisement

  నాలుగు రోజుల కిందట ఈ పైరసీ సైట్‌ను నడుపుతున్న కొంతమందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందుతుడిని అదుపులోకి తీసుకుని సైట్‌ను మూసేస్తామని ప్రకటించారు. అది జరిగిన వెంటనే IBomma పేరుతో ఓ వార్నింగ్ స్టేట్‌మెంట్ బయటకు వచ్చింది. “మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ ఫోకస్ చేస్తామన్న” వార్నింగ్ తో స్టార్ట్ అయి.. సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తెచ్చిన తమ జోలికి వస్తే.. అందరి సంగతి తేలుస్తామని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఒక నోట్ బయటకు వచ్చింది. సినిమా బడ్జెట్‌ను అనవసరంగా పెంచేస్తున్నారని.. కెమెరా ప్రింట్ వాళ్లని ఏం చేయలేక..OTT రెవిన్యూ కోసం తమ మీద నిందలు వేస్తున్నారని IBomma ఆరోపించింది. అంతే కాకుండా.. తమ చానల్‌లో చూస్తున్నవారిలో కొంతమంది మూవీ హీరోలు కూడా ఉన్నారని .. వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా బయటపెడతామని IBomma హెచ్చరించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అది రెండేళ్ల కిందటి నోట్ అని తేలింది.

మన అమరావతి మీడియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బోసు కంచర్ల గద్దర్ నా ఓటు 2000 సినిమా నిర్మించి, నటించారు. కానీ పెద్ద బ్యానర్లు కాకపోతే.. చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం కష్టం అవుతోందని.. అలాంటి వాటికి OTTలు కాస్త తోడ్పాటునిస్తున్నాయన్నారు. ఇప్పుడు IBomma లాంటి సైట్లు అలాంటి వేదికను కూడా లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                     “ కన్యాకుమారి సినిమా చాలా బాగుంది. నేను కూడా 10మందికి చెప్పాను.. చూడమని.. అక్కడ వ్యూస్ పెరిగితే ఆ నిర్మాతకు..పెట్టుబడి రికవరీ అవుతుంది. . కానీ అలాంటి సినిమాను కూడా  పైరసీ సైట్‌లో పెట్టి నిర్మాతకు Oxygen  లేకుండా చేస్తున్నారు. మళ్లీ మీరు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు.” అని నిలదీశారు.

Continues below advertisement

చిన్న సినిమాలు పైరసీ సైట్‌లో పెట్టమని చెప్పే ధైర్యం ఉందా..?

పెద్ద సినిమాలకు వ్యతిరేకం అంటూ IBomma  పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ వాళ్ల పైరసీ సైట్‌లో చాలా వరకూ ఉండేది చిన్న సినిమాలే.. అని బోసు ఆక్షేపించారు. “౩-4 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాను తమ సైట్‌లో పెట్టం అని ఐబొమ్మ ప్రమాణం చేయగలుగుతుందా..? సోది స్టేట్‌మెంట్లు కాకుండా చెప్పిన దానికి నిలబడే దమ్ముందా..?” నిలదీశారు.  నేను నా సేవింగ్స్ మొత్తం సినిమాకే పెట్టేశాను... నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు. కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఇదంతా చేశాను. ఇంతవరకూ సినిమా నుంచి ఒక్క రూపాయి రాలేదు. అయినా మీరు నా లాంటి వాడి సినిమాను కూడా తీసుకొచ్చి మీ పైరసీ సైట్లలో పెడతారు. మా కలలను చంపేస్తున్నారు. ఇలా చేస్తే మేం మళ్లీ ఇంకో సినిమా చేయగలుగుతామా..? కన్యాకుమారి సినిమాను పైరసీ చేశారు. రేపు నా గద్దర్ సినిమాను చేయరని గ్యారెంటీ ఏంటి” అని బోస్ ప్రశ్నించారు.

 

OTT లే మమ్మల్ని బ్రతికిస్తోంది.

చిన్న సినిమాలు ధియేటర్ల వద్దకు రాలేకపోతున్నాయి. భారీ కాస్టింగ్, గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలనే జనం థియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగోకపోతే.. వాటిని కూడా చూడటం లేదు.   కాస్తో కూస్తో.. చిన్న సినిమాను  బ్రతికిస్తోంది OTT మాత్రమే. ఇప్పుడు ఆ OTT ఆదాయాన్ని కూడా ఈ పైరసీ చంపేస్తోందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలను చంపేస్తోంది… ప్రేక్షకులు.. నిర్మాతలు.. కాదు.. ఈ పైరసీ సైట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.