Pawan Kalyan's OG OTT Release With Additional Scenes: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG'. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే రూ.252 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ప్రస్తుతం థియేట్రికల్ రన్ మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతుండగా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని పవర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'OG' డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా అక్టోబర్ చివరి వారంలో మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్
అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ టైంలో మూవీ టీం ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని సీన్స్ యాడ్ చేసి అందుబాటులోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. రిలీజ్ టైంలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కట్ చేయగా... కొద్ది రోజుల తర్వాత యాడ్ చేశారు మేకర్స్. ఓటీటీలోకి వచ్చే టైంలోనూ సీన్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉండడంతో అవి ఎలాంటి యాక్షన్ సీన్సో అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సాటి పవన్ అభిమానిగా పవర్ స్టార్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకున్నారో అలానే సిల్వర్ స్క్రీన్‌పై చూపించారు డైరెక్టర్ సుజీత్. చాలా రోజుల ఎవరూ ఊహించని విధంగా పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ లుక్స్, గ్యాంగ్ స్టర్ గంభీరగా ఆయన గ్రేస్ అన్నీ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. హీరో ఎలివేషన్స్, దానికి తగ్గట్టు బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయి.
మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. వీరితో పాటే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ముంబయి కొలాబా పోర్టును సత్య దాదా (ప్రకాష్ రాజ్) కనుసన్నల్లో ఉంటుంది. ఆ పోర్టుకు డ్రగ్స్‌తో ఉన్న ఓ కంటైనర్ రాగా... సదరు ముఠా సత్య దాదా కొడుకును చంపేస్తుంది. దీంతో ఎవరి కంటా పడకుండా ఈ కంటైనర్‌ను దాచేస్తాడు సత్య దాదా. దీని కోసం సత్య దాదా స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) పెద్ద కొడుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో సత్య దాదా కొడుకులా పెంచి పెద్ద చేసిన 'గంభీర' (పవన్ కల్యాణ్) ఎంటర్ అవుతాడు. అసలు ఈ ఫ్యామిలీని వదిలి గంభీర ఎందుకు వెళ్తాడు? డ్రగ్స్ ముఠా నుంచి సత్య దాదా ఫ్యామిలీని ఎలా కాపాడాడు? గంభీరకు కణ్మనికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.