Shraddha Srinath's The Game Web Series OTT Streaming On Netflix: ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సైబర్ మోసాలతో ఓ మహిళా గేమ్ డెవలపర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే ప్రధానాంశంగా రూపొందిన సైబర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అగైన్'. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' కోసం రూపొందించారు.
తెలుగులోనూ స్ట్రీమింగ్
దసరా సందర్భంగా గురువారం నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది ఈ సిరీస్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 24 గంటల్లోనే ట్రెండింగ్‌లో నిలిచింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందిన ఈ సిరీస్‌కు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించగా... దీప్తి గోవిందరాజన్ స్టోరీ అందించారు. శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు చాందిని, సంతోష్ ప్రతాప్, శ్యామా హరిణి, బాలహాసన్, హేమా, ధీరజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: నేచరల్ స్టార్ నానితో 'OG' డైరెక్టర్ సుజిత్ మూవీ స్టార్ట్ - సిల్వర్ స్క్రీన్ ఆన్ ఫైర్
స్టోరీ ఏంటంటే?
ఈ సిరీస్‌లో కావ్య అనే గేమ్ డెవలపర్‌గా నటించారు శ్రద్ధా శ్రీనాథ్. ఓ పెద్ద కంపెనీలో గేమ్ డెవలపర్‌గా మంచి పేరు సంపాదించుకుంటుంది కావ్య. అయితే, సోషల్ మీడియాలో ఆమెపై అనూహ్యంగా ట్రోలింగ్స్ మొదలవుతాయి. ఇదే టైంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు సంబంధించిన వస్తువులు దొంగిలించి క్రైమ్‌కు పాల్పడుతారు. దీంతో కావ్య ఇబ్బందుల్లో పడుతుంది. అసలు ఆమెపై ట్రోలింగ్స్‌కు కారణం ఏంటి? ఆమెపై దాడికి పాల్పడింది ఎవరు? డిజిటల్ వరల్డ్‌లో తనపై జరిగిన మోసాన్ని ఆమె ఎలా ఎదుర్కొన్నారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.