RK Sagar New Pan India Movie Announced: 'మొగలిరేకులు' సీరియల్‌లో ఆర్కే నాయుడుగా మంచి ఫేం సంపాదించుకున్న హీరో ఆర్కే సాగర్... రీసెంట్‌గా క్రైమ్ థ్రిల్లర్ 'ది 100' మూవీతో హిట్ అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Continues below advertisement

'జార్జ్ రెడ్డి' డైరెక్టర్‌తో...

ఈసారి సింగరేణి కార్మికుల రియల్ లైఫ్ జీవితాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు ఆర్కే సాగర్. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి' సినిమాతో పాపులరైన జీవన్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ఫేమస్. అలాంటి గనుల బ్యాక్ డ్రాప్‌లో తెలుగులో చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. 

Continues below advertisement

సింగరేణి కార్మికుల జీవితాలు, గనుల్లో వారు పడే కష్టాలు, పోరాటాలు, ఆశయాలు, అనుబంధంలో ఈ మూవీ తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ఆడియన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. మైనింగ్ ప్రాంతాల్లో కఠినమైన వాతావరణం, కార్మికుల త్యాగాలు, వారి జీవన శైలి, పోరాటాలు, ఆశయాలు అన్నీ కలగలిపి మూవీలో చూపించనున్నట్లు చెప్పారు.

Also Read: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌కు షాక్ - పూజా మండపం వద్ద అనుచితంగా తాకిన వ్యక్తి... వైరల్ వీడియో

త్వరలోనే షూటింగ్

ఈ మూవీలో సాగర్ హీరోగా నటిస్తుండగా... మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని మూవీ టీం చెబుతోంది. ఇక ఇతర పాత్రలో కోసం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ యాక్టర్స్‌ను తీసుకోబోతున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటులు, వివరాలు త్వరలోనే తెలపనున్నారు.

స్వతహాగా సింగరేణి కార్మికుడు కుటుంబం నుంచి వచ్చిన సాగర్... తాను చిన్నప్పటి నుంచి చూసిన జీవితాన్ని, ఆ పాత్రల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండేలా అండర్ గ్రౌండ్ బొగ్గు గని సెట్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో 'ఉస్మానియా' కళాశాలలో ఉంటూ తెలంగాణ పాలిటిక్స్ ప్రభావితం చేసిన విద్యార్థి నాయకుడు 'జార్జ్ రెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదే స్ఫూర్తిగా మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌ను డైరెక్టర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.