Anasuya Bharadawaj's Ari Movie Release Date: యాంకర్, హీరోయిన్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ 'అరి'. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనే ట్యాగ్ లైన్‌తో పేపర్ బాయ్' ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా దసరా సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనసూయతో పాటు సాయి కుమార్, వినోద్ వర్మ, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో 'ఆర్వీ' సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, శేషు మారంరెడ్డి సంయుక్తంగా మూవీని నిర్మించారు.
తెలుగు తెరపై ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌ను డైరెక్టర్ జయశంకర్ మూవీలో చూపించారు. అరిషడ్వర్గాలే బ్యాక్ డ్రాప్‌గా ఓ మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: ట్రెండింగ్‌లో 'ది గేమ్' వెబ్ సిరీస్ - డిజిటల్ వరల్డ్‌లో స్కామ్స్... తెలుగులోనూ ఇప్పుడే చూసెయ్యండి
Ari Movie Cast And Crew: అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు.
టెక్నికల్ టీం: మ్యూజిక్ : అనుప్ రూబెన్స్, ఎడిటర్ : జి. అవినాష్, లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి, కొరియోగ్రఫీ - భాను, జీతు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన, సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్, సమర్పణ : రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ), కో ప్రొడ్యూసర్ - లింగ గుబపనేని, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు, రచన –దర్శకత్వం : జయశంకర్.
'జబర్దస్త్' షోతో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ భరద్వాజ్ 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత రంగస్థలం, యాత్ర, కథనం, పుష్ప, పుష్ప 2, రంగమార్తాండ, విమానం, రజాకార్, సింబా సినిమాల్లో తన నటనతో మెప్పించారు. అటు టీవీ షోస్, ఇటు సినిమాల్లో చేస్తూ రీసెంట్‌గా 'అరి' మూవీలో నటించారు.