బిగ్ బాస్ అంటేనే రోతగా ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా ఆసక్తి చూపేలా నడుస్తోంది సీజన్ 9. ప్రస్తుతం హౌస్ లో కంటెండర్షిప్ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాస్కులలో పవర్ కార్డ్స్ ద్వారా బిగ్ బాస్ కొన్ని టాస్కులు పెడుతున్నారు. తాజా ఎపిసోడ్ లో 'హంగ్రీ హిప్పో' అనే టాస్క్ పెట్టారు. అది సౌండ్ చేసినప్పుడల్లా తాను చెప్పిన కలర్ బాల్స్ తీసుకొచ్చి, సౌండ్ చేసే హిప్పోకి తినిపించాలని చెప్పారు. దీనికి భరణిని సంచాలక్ గా పెట్టారు. 

Continues below advertisement

టాస్కులలో ఫేవరెటిజం... ఎల్లో టీం మధ్య విబేధాలు  ఈ టాస్కులో కంటెస్టెంట్ల మధ్య పోట్లాట మాములుగా జరగలేదు. ఆల్మోస్ట్ కుస్తీ పోటీలా నడిచింది. హరీష్ కు గాయం కావడంతో శ్రీజ ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేశారు. ఈ గ్యాప్ లో సంచాలక్ "నా నడుమును ఎవరో గిల్లారు. నా నడుము అంత బాగుంటే మాత్రం అలా గిల్లుతారా ? అది పర్సనల్ అబ్యూజ్" అని కంప్లైంట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. "ఎవరిపై అయినా అనుమానం ఉందా ?" అని భరణి అడగ్గా... "ఎవరో నడుము గిల్లి చెయ్యి నొప్పి అయ్యిందని అరిచారు" అంటూ ఇమ్మూ చెప్పుకొచ్చాడు. దీంతో తనూజ అందుకుని "నీ నడుము గిల్లానని ఏమైనా ప్రూఫ్ ఉందా?" అని అడిగింది. "అది నాగార్జున గారు వీకెండ్ చూపిస్తారు" అని ఇమ్మూ చెప్పాడు. తరువాత మళ్ళీ గేమ్ లో మునిగిపోయారు. 

గ్రూప్ గేమ్... బిగ్ బాస్ చిచ్చు పెడితే ఇట్లుంటది మరి  ఇంతలో "బాల్ ఎవరు పట్టుకున్నారు? " అనే కన్ఫ్యూజన్ మొదలైంది. సంచాలక్ అయితే బ్లూ టీంకి పాయింట్ ఇచ్చేశాడు. 20% బాల్ శ్రీజ చేతిలో ఉండగా, 70% బాల్ కళ్యాణ్ చేతిలో ఉందని చెప్పి సంచాలక్ బ్లూ టీంకి పాయింట్ ఇవ్వడంతో ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. కానీ భరణి తనకు న్యాయం అన్పించింది కాబట్టి అదే చేశానని చెప్పాడు. దీంతో భరణి - ఇమ్మాన్యుయేల్ మధ్య గ్యాప్ వచ్చింది. క్లోజ్ గా ఉండే వీళ్ళ మధ్య గేమ్ తో బిగ్ బాస్ చిచ్చు పెట్టినట్టుగా అయ్యింది. 

Continues below advertisement

హౌస్ లో తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. పైగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఈ టాస్క్ లో బిగ్ బాస్ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాడు. తనూజ ఒకానొక టైంలో "అన్ ఫెయిర్" అంటూ భరణిపై మండిపడింది. "ఇష్టమైతే మీరే పాయింట్ ఇచ్చుకోండి. గేమ్ ఎందుకు?" అంటూ తనూజ ఫైర్ అయ్యింది. అలాగే ఎల్లో టీం నుంచి సంజన రెడ్ టీంను సపోర్ట్ చేయడం, ఆమె-సుమన్ తనకు ఏ విషయం చెప్పకపోవడంతో రామూ రాథోడ్ నొచ్చుకున్నాడు. "పెద్దాయన పెద్దాయన అంటూ అడ్డం పడేస్తుంది" అని సంజనపై ఫైర్ అయ్యాడు సుమన్ శెట్టి. కానీ తన ఎల్లో టీంను కాదని రెడ్ టీంకి ఫేవర్ చేస్తానని , తన కోసం కెప్టెన్సీని త్యాగం చేసిన ఇమ్మూకి సపోర్ట్ చేస్తానని కుండబద్దలు కొట్టింది సంజన. ఇదే ఎల్లో టీం మధ్య విబేధాలు క్రియేట్ చేసింది.

Also Read: బిగ్‌బాస్ డే 24 రివ్యూ... అన్యాయం జరిగిన చోటే కామన్ మ్యాన్ సత్తా... తనూజ ఫస్ట్ లవ్

కంటెండర్షిప్ గెలుచుకున్న ఆ నలుగురు ఈ టాస్కులో రెడ్ టీం విన్నర్ గా నిలవగా, ఇమ్మాన్యుయేల్ కి కంటెండర్షిప్ పవర్ కార్డును ఇచ్చాడు కళ్యాణ్. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కలిసి కంటెండర్షిప్ కోసం మొత్తం 6 మంది హౌస్ మేట్స్ ను, 3 టీమ్స్ గా విడగొట్టాలని బిగ్ బాస్ ఆదేశించారు. రీతూ-ఫ్లోరా, రాము -సంజన, తనూజ - సుమన్ లను సెలెక్ట్ చేశారు. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ లు సంచాలక్ గా పెట్టిన బోన్ టాస్కులో రామూ రాథోడ్, రీతూ కెప్టెన్సీ కంటెండర్షిప్ విన్ అయ్యారు. రూల్స్ పాటించకుండా మొదట్లోనే డిస్క్వాలిఫై అయిన తనూజ వాష్ రూమ్ లోకి వెళ్లి మరీ కుళాయి తిప్పేసింది. మరోవైపు "గేమ్ అన్ ఫెయిర్ గా జరిగింది. ఇంక ఈ హౌస్ లో గేమ్స్ ఆడను నేను" అంటూ ఫ్లోరా బాధ పడింది.

Also Readబిగ్‌బాస్ డే23 రివ్యూ... నామినేషన్ల రచ్చ, మళ్ళీ నోరు పారేసుకున్న సంజన... ఎవ్వరూ తగ్గట్లే, అందరి మాస్కులూ తొలగించిన బిగ్ బాస్