బిగ్ బాస్ సీజన్ 9 డే 23 ఎపిసోడ్ 24లో నామినేషన్లతో రచ్చ రచ్చ చేశారు హౌస్ మేట్స్. ఇప్పటికే బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టగా, అందులో తనూజ, సుమన్ శెట్టి విన్ అయ్యి, నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. కానీ మిగిలిన ఇంటి సభ్యులు మాత్రం ఇంకా నామినేషన్ల జోన్ లోనే ఉన్నారు. నేటి ఎపిసోడ్ లో మొత్తం 6 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ లూడోలో ఓడినోళ్లే నామినేషన్లలో...
సంజన ఫుడ్ మానిటర్ అవ్వడం గురించి హౌస్ మొత్తం చర్చించారు. తరువాత "వైఫ్ అండ్ హస్బెండ్" టాస్క్ తో తనూజ రీతూ, ఇమ్మాన్యుయేల్ కలిసి కాసేపు ఎంటర్టైన్ చేశారు. అంతలోనే నామినేషన్ల రచ్చ షురూ అయ్యింది. నాలుగు టీమ్స్ మధ్య నామినేషన్లు ఉంటాయంటూ బిగ్ బాస్ సుమన్ - ఎల్లో, తనూజ - బ్లూ, కళ్యాణ్ - రెడ్, భరణి - గ్రీన్... టీంలీడ్స్ గా నియమించారు. మిగతా ఇంటి సభ్యులలో ఎవరు ఎవరి టీం ఉండాలో డిసైడ్ అవ్వమన్నారు. సంచాలక్ డెమాన్ డైస్ వేసి, ఆ రౌండ్ లో ఏ టీం ముందుకు వెళ్ళాలో డిసైడ్ చేయాలని చెప్పారు. ఆ లూడో బోర్డులో టైమ్ వచ్చినప్పుడు నామినేషన్ చేసే పవర్ ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. డైస్ ఆడిన టీమ్, తామే స్వయంగా ఆపోజిట్ టీంను ఎంచుకుని రోప్ గేమ్ ఆడాల్సి ఉంటుంది.
ముందుగా తనూజకు నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది. సుమన్ శెట్టి గ్రీన్ టీంతో తనూజ టీం రోప్ టాస్క్ ఆడగా.. . సుమన్ టీం గెలిచి, ఓడిపోయిన తనూజ టీం నుంచి రీతూను నామినేట్ చేశారు. "ఇక్కడి మాట అక్కడ... అక్కడ మాట ఇక్కడ చెప్పి డబుల్ గేమ్ ఆడుతున్నావ్" అంటూ రీతూనీ నామినేట్ చేశారు. సెకండ్ నామినేషన్ ఛాన్స్ సుమన్ శెట్టికి రాగా, భరణి గ్రీన్ టీంతో గేమ్ కు సిద్ధం అయ్యారు. ఇక బిగ్ బాస్ సూచన మేరకు సుమన్ టీంకు అడ్వాంటేజ్ ఇచ్చాడు డెమాన్. ఇక బ్లూ టీం రీతూ... గ్రీన్ టీం నుంచి శ్రీజను నామినేట్ చేసింది. దివ్య బట్టలు సంజన దొంగతనం చేస్తుంటే హెల్ప్ చేయడం కరెక్ట్ కాదని, గుడ్డు విషయంలో సంజన అని చెప్పిన నువ్వే అలా నీ టీమ్ టెనెంట్ ను మొదటిరోజే అవమానించడం నచ్చలేదని శ్రీజను నామినేట్ చేసింది. "బయట నుంచి చూసి ఫన్ అని ఫీల్ అయ్యావు కదా అంటూ... ఓ మనిషిని గిచ్చి అది నొప్పి ఉందా లేదా? ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనడం కరెక్ట్ కాదు" అని రీతూ చెప్పింది. "కంటెంట్ కోసం రీతూ డెమాన్ తో ఉంటోంది అనే స్టాంప్ వేయడం నచ్చలేదు" అంటూ మరో రీజన్ చెప్పింది.
ఎవ్వరూ తగ్గట్లే... మాస్కులు తీసేసిన ఫ్లోరా, రామ్
రాము సంజనను నామినేట్ చేస్తూ "అమ్మాయిలైతేనే మాట్లాడతావ్, అమ్మలు కాబట్టి పట్టించుకోట్లేదు" అంటూ సంజన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదని నామినేట్ చేశాడు. దీంతో సంజన "ఎక్కడి నుంచి వచ్చావో గానీ" అంటూ రాముపై నోరు పారేసుకుంది. దీంతో రాము "కించపరిచేలా మాట్లాడొద్దు" అంటూ సాఫ్ట్ గానే చెప్పాడు. ఈ విషయంలో సంజనదే తప్పు అని హౌస్ మేట్స్ మొత్తం చెప్పినా, ఆమె మాత్రం వినలేదు. ఫ్లోరా "హరీష్ యాపిల్ టాస్క్ లో దొంగతనం చేశానని నాపై అనుమాన పడ్డారు" అంటూ అతన్ని నామినేట్ చేసింది. "అమ్మాయిలు అన్నపూర్ణాదేవి, లక్ష్మీబాయి అని అన్న మీరే చిన్న విషయానికి నన్ను బెదిరించారు అది కరెక్ట్ కాదు" అంటూ హరీష్ ను నామినేట్ చేసింది. దీంతో హరీష్ - తనూజ - ఫ్లోరా - రామ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. "సంజన ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాక, ఏదో అంటే అలిగి ఫుడ్ వండడం ఎందుకు మానేశారు?" అంటూ రాము తన పాయింట్ చెప్పగా, మాస్క్ మ్యాన్ మాత్రం "ఇక మారడా" అనిపించేలా ఇంకేదో మాట్లాడి గొడవను పెద్దను చేశాడు. అలాగే శ్రీజ... దివ్యను నామినేట్ చేసింది.
ఈ నామినేషన్ లో దివ్య - సంజన మధ్య వార్ హైలెట్ అయ్యింది. ఈ వారం రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ దమ్ము, హరిత హరీష్, దివ్య నామినేట్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ చెప్పేదాకా ఆ బోర్డు తీసేయడానికి వీల్లేదని చెప్పారు. పాపం రెడ్ టీంకు డెమాన్ పవన్ అసలు అవకాశమే ఇవ్వలేదు.