బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ముందుగానే దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వీకెండ్ నాగార్జునతో పాటు సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరోలతో కలిసి హౌస్ మేట్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎపిసోడ్ 22 డే 21 రోజు హౌస్ మేట్స్ ను నాగార్జున బ్లూ టీం, రెడ్ టీం అంటూ 2 టీంలుగా విడగొట్టారు. అందులో దివ్య, ఇమ్మాన్యుయేల్ చెరొక టీంకి లీడర్లుగా వ్యవహరించారు. మొదటి టాస్క్ లో నటీనటుల పేర్లు ఇచ్చి, వాళ్ళ కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమా పేరు చెప్పమనగా, ఇమ్మూ రెడ్ టీం గెలిచింది. దీంతో జమ్మి చెట్టుమీద ఉన్న ఆయుధాలలో చైన్ ను తీసుకొచ్చి, ఆ స్పెషల్ పవర్ తో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ ను రీతూకి గిఫ్ట్ గా ఇచ్చాడు ఇమ్మూ. 

Continues below advertisement

మబ్బులు విడిపోయే టాస్క్ ఇదే "ఆస్క్ బీబీ టీమ్" టాస్క్ లో ఆడియన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను అడగాలనుకున్న ప్రశ్నలని నాగార్జున అడిగారు. దానికి హౌస్ మేట్స్ ఇచ్చే ఆన్సర్ జెన్యూనా కాదా అనే విషయాన్ని లైవ్ లో పోలింగ్ ద్వారా వెల్లడించారు. ఇలా చేయడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైమ్. "రీతూ నువ్వు చిన్న విషయానికే ఏడుస్తారు? ఇది స్ట్రాటజీనా? మీరు మీకంటే డెమాన్ పవన్ కోసమే ఎక్కువ ఆడుతున్నారు?" అని అడగ్గా, "అతని కోసం ఆడట్లేదు. కానీ జెన్యూన్ ఎఫెక్షన్ ఉంది" అని చెప్పింది. ఆడియన్స్ మాత్రం 65% నెగెటివ్ ఓటింగ్ తో ఆమె జెన్యూన్ కాదని చెప్పారు. 

సుమన్ శెట్టి గేమ్ కనిపించట్లేదు అనే ప్రశ్నకు "నా ఎఫెర్ట్స్ పెడుతున్నాను. పెడతాను" అని రిప్లై ఇచ్చాడు. అతను 81% జెన్యూన్ అని ఓటింగ్ లో తేలింది. "హరీష్ ప్రతీ సీజన్ నుంచి ఒకరి యాక్షన్ ను, మరొకరి డైలాగ్ ను కాపీ కొడుతున్నారు. మీరు స్ప్లిట్ పర్సనలిటినా?" అంటే ఆయన తనలా ఉన్నట్టు చెప్పాడు. కానీ ఆడియన్స్ మాత్రం 74% నెగెటివ్ అని తీర్పు ఇచ్చారు. "మిమ్మల్ని ఓటేసి బిగ్ బాస్ హౌస్ కి పంపింది గొడవలు పడడానికా ? ప్రియా నువ్వూ నోరేసుకుని పడిపోతున్నారు. గొడవలు మాని ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి" అంటే శ్రీజ చెప్పిన సమాధానానికి ఆమె జెన్యూన్ కాదని 74% ఓటింగ్ వచ్చింది. అలాగే కళ్యాణ్ కు 58% నెగెటివ్, భరణికి 58% పాజిటివ్ ఓటింగ్, ప్రియాకు 82% నెగెటివ్ ఓటింగ్ వచ్చాయి. అలాగే తనూజ జెన్యూన్ అని 77%, పవన్ - రీతూ బాండింగ్ ఫేక్ అని 86%, ఇమ్మూ జెన్యూన్ అని 91% ఓటింగ్ వచ్చింది. చివరికి హయ్యెస్ట్ ఓటింగ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్ ను గర్వాన్ని తలకు ఎక్కించుకోవద్దు అంటూ కిరీటాన్ని పెట్టి మరీ సత్కరించారు.

Continues below advertisement

Also Readబిగ్‌బాస్9 డే19 రివ్యూ... సీక్రెట్ రూంతో బుర్రపాడు ట్విస్ట్... 3వ కెప్టెన్‌గా ఇమ్మూ... మిడ్ వీక్ ఎలిమినేషన్ కు సంజన బలి

మరోసారి కెప్టెన్ గా డెమాన్ నెంబర్ చెప్పగానే, దానికి తగ్గట్టుగా గ్రూప్ గా అయ్యేలా 'కలిసుందాం రా' అనే టాస్క్ పెట్టారు. "తెలుసు కదా" టీంలోని హీరో హీరోయిన్లు సిద్ధూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిని దీనికి జడ్జిగా పెట్టారు. ఈ టాస్క్ లో పులి, కోతి, తాగుబోతు, రోబో డ్యాన్స్ లు వేయించగా, ఇందులో కూడా టీమ్ రెడ్ విన్ అయ్యింది. అయితే ఇలా గెలిచిన ప్రతీ టీమ్ లో ఒకరికి ఫ్యామిలీ మెసేజ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే "తెలుసు కదా" టీం సమక్షంలో బతుకమ్మ టాస్క్ ను పెట్టారు. ఇందులో బ్లూ టీం గెలిచిందని సిద్ధూ ప్రకటించారు. "విందుతో పాటు వినోదం" అంటూ ఫుడ్ టాస్క్ పెట్టారు. ఇందులో బ్లూ టీం గెలిచింది. ఫ్యామిలీ మెసేజ్ అందుకున్న రీతూ, సంజన, హరీష్, డెమాన్,  రాములకు నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. "బుట్టబొమ్మ" అనే టాస్క్ లో విన్ అయ్యి డెమోన్ మరోసారి కెప్టెన్ అయ్యాడు. 

ప్రియకు పీడకలగా మారిన పండగ నామినేషన్లలో హరీష్, రీతూ చౌదరి, రామూ రాథోడ్, కళ్యాణ్ పడాల, ప్రియా శెట్టి ఉండగా... ఒక్కో టాస్క్ లో ఒక్కొకరిని సేవ్ చేశారు. చివరికి ప్రియా ఎలిమినేట్ అయ్యింది. ప్రియా వెళ్లిపోతూ హరీష్, తనూజ, భరణిలకు డెవిల్ అనే ట్యాగ్స్ ఇచ్చింది.

Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 20 రివ్యూ... నలుగురి త్యాగంతో సంజన రీఎంట్రీ... ఇకపై దొంగతనం చేస్తే దబిడి దిబిడే... హౌస్‌మేట్స్‌ను కడిగేసిన నాగ్