Rishab Shetty's Kantara 2 First Day India Collection: నో మోర్ కాంట్రవర్సీ... ఓన్లీ కలెక్షన్స్... బాక్స్ ఆఫీస్ త్వరలో రిషబ్ శెట్టి రుద్ర తాండవం మొదలైంది. 'కాంతార చాప్టర్ 1' సినిమాకు భారీ ఓపెనింగ్ లభించింది. ఇండియాలో ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. మొదటి రోజు మన దేశంలో నెట్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి? అంటే...
ఇండియాలో 60 కోట్ల నెట్...ప్రీమియర్స్ ప్లస్ ఓపెనింగ్!Kantara 2 First Day Collection: ఇండియాలో మొదటి రోజు 60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించింది. 'కాంతార చాప్టర్ 1' గ్రాస్ చూస్తే 75 కోట్ల నుంచి 80 కోట్ల మధ్యలో ఉంటుందని ఒక అంచనా.
కర్ణాటకలో కంటే నార్త్ ఇండియాలో 'కాంతార ఛాప్టర్ 1'కు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. హిందీ వెర్షన్ మొదటి రోజు సుమారు 20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. కన్నడ వెర్షన్ విషయానికి వస్తే 18 కోట్లు వచ్చాయి. తెలుగులోనూ సినిమా మంచి నంబర్లు రాబట్టింది. ఓపెనింగ్ డే సుమారు 13 కోట్లు వచ్చాయి. తమిళంలో 5.25 కోట్లు, మలయాళంలో 4.75 కోట్లు వచ్చాయి. దాంతో మొదటి రోజు 60 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. సౌత్ ఇండియన్ క్రిటిక్స్ నుంచి 'కాంతార చాప్టర్ 1'కు మంచి ప్రశంసలు లభించాయి. నార్త్ నుంచి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్... మమ్ముట్టి, మోహన్ లాల్, నయన్ సినిమా టీజర్ చూశారా?
ఓవర్సీస్ మార్కెట్ కూడా బావుంది!'కాంతార ఛాప్టర్ 1' సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ కూడా బావుంది. అక్కడ రెండు రోజుల్లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్బులో చేరే అవకాశం ఉంది. విజయ దశమి సెలవులు 'కాంతార 2'కు కలిసి వచ్చాయి. వీకెండ్ వరకు భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫుట్ ఫాల్స్ ఎలా ఉంటాయి? అనేది చూడాలి.
రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించిన 'కాంతార ఛాప్టర్ 1'లో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక తారాగణం. హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి 'కొదమసింహం' రీ రిలీజ్: 35 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి... డేట్ ఫిక్స్!