Best Thriller Movies On OTT: దాదాపు అన్ని సైకో థ్రిల్లర్ సినిమాలకు ఒకే విధమైన పాటర్న్ ఉంటుంది. ఒక సైకో కిల్లర్.. తనకు ఒక గతం. ఆ గతంలో ఒక విషాదం. అది దృష్టిలో పెట్టుకొని అందరినీ వేటాడి చంపే సైకో కిల్లర్. అలాంటి ఎన్నో సైకో కిల్లర్ కథలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. నేరుగా ఓటీటీలో విడుదలయినా కూడా ఇలాంటి మూవీస్‌ను చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘థ్యాంక్స్‌ గివింగ్’ (Thanksgiving). చివరివరకు ఈ సినిమాలో సైకో కిల్లర్ ఎవరు అని గెస్ చేయడం చాలా కష్టం.


కథ..


‘థ్యాంక్స్ గివింగ్’ కథ విషయానికొస్తే.. ఒక టౌన్‌లో రైట్‌మార్ట్ అనే సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ ప్రతీ ఏడాది థ్యాంక్స్ గివింగ్ సమయంలో ఒక సేల్ జరుగుతుంది. ఆ సేల్ కోసం టౌన్‌లోని ప్రజలంతా అక్కడికి చేరుకుంటారు. అలా ఒక ఏడాది థ్యాంక్స్ గివింగ్‌లో జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోతారు. అలా రైట్‌మార్ట్ పేరు అంతటా మారుమోగిపోతుంది. కానీ అప్పటినుండే ఆ టౌన్‌లో హత్యలు మొదలవుతాయి. ముందుగా రైట్‌మార్ట్‌లో పనిచేసే లిజ్జీ అనే వెయిట్రెస్ హత్య జరుగుతుంది. ఒక వ్యక్తి జాన్ కార్వర్ (1620లోని రైటర్) మాస్క్ వేసుకొని లిజ్జీని చంపేశాడని పోలీసులకు తెలుస్తుంది. రైట్‌మార్ట్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రమేయం ఉన్నవారిని ఆ కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఘోరమైన పోస్టులు చేసి అందులో జెస్సికా (నెల్ వార్లెక్)ను ట్యాగ్ చేస్తాడు ఆ కిల్లర్. జెస్సికా.. రైట్‌మార్ట్ ఓనర్. 


జెస్సికా కంటే ముందు మరికొందరిని కిడ్నాప్ చేసి చంపేస్తాడు కిల్లర్. యూలియాను ఇంటి నుండి కిడ్నాప్ చేసి తనను చంపడానికి ప్రయత్నిస్తాడు. జెస్సికా, తన ఫ్రెండ్ స్కూబా కలిసి యూలియాను కాపాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ కిల్లర్.. తమ కళ్ల ముందే యూలియాను చంపేస్తాడు. ఆ తర్వాత క్యాథ్లీన్, జెస్సికా, జెస్సికా తండ్రి, స్కూబాను కిడ్నాప్ చేస్తాడు కిల్లర్. ముందుగా జెస్సికా తల్లి అయిన క్యాథ్లీన్‌ను చంపి, ముక్కలు ముక్కలుగా నరికి కుక్ చేస్తాడు కిల్లర్. ఆ తర్వాత డైనింగ్ టేబుల్‌పై తను కిడ్నాప్ చేసిన మనుషులకు ఆ వంటను సర్వ్ చేస్తాడు. అప్పుడే ఒక వ్యక్తిని అందరి ముందే చంపేస్తాడు. జెస్సికా, స్కూబా అక్కడి నుండి తప్పించుకొని అడవిలోకి పరిగెడతారు. ఆ తర్వాత ఏమైంది? జెస్సికా ఆ కిల్లర్ నుండి తప్పించుకోగలడా? అసలు ఆ కిల్లర్ ఎవరు? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.



కిల్లర్ ఎవరు.?


ఇతర ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమాలలాగానే ‘థ్యాంక్స్ గివింగ్’లో కూడా చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. కానీ చివరివరకు అసలు కిల్లర్ ఎవరో తెలియకుండా బాగా మ్యానేజ్ చేశాడు దర్శకుడు ఎలీ రోథ్. ఒక టౌన్‌లో జరిగే కథ కాబట్టి అందులో ఉండే ప్రతీ యాక్టర్‌కు సమానంగా ప్రాధాన్యత లభించేలా చేశాడు. ప్రతీ పాత్ర ప్రేక్షకుల్లో రెజిస్టర్ అయ్యేలా చేశాడు. ఒక సింపుల్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు అందుబాటులో ఉన్న ‘థ్యాంక్స్ గివింగ్’పై ఓ లుక్కేయండి.


Also Read: తన కోరిక తీర్చుకునేందుకు తల్లిదండ్రులను సైతం చంపేసే కూతురు - ఆమెను చూస్తేనే వణుకు పుట్టేస్తుంది, డోన్ట్ మిస్!