దర్శకుడిగా కె విజయ భాస్కర్ పేరు, రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు తెరపై పడితే ఆ సినిమా బంపర్ హిట్ అని ఆడియన్స్ అందరూ బలంగా నమ్మేవారు. 'స్వయం వరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి', 'జై చిరంజీవా' వంటి హిట్ సినిమాలు వాళ్ళ కలయికలో వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత కె విజయ భాస్కర్ హవా తగ్గింది. కొంత విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'జిలేబి'. గత ఏడాది థియేటర్లలో విడుదల కాగా... డిజాస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
ఆహాలో జూలై 13 నుంచి 'జిలేబి' స్ట్రీమింగ్
Jilebi Movie OTT Platform: 'జిలేబి' సినిమాతో విజయ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అయ్యారు. ఆయనకు జోడీగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ - నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ నటించారు. ఎస్సార్కే ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ప్రొడ్యూస్ చేశారు. అంజు అశ్రాని చిత్ర సమర్పకులు.
Jilebi Movie OTT Release Date: యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఆగస్టు 18, 2023లో థియేటర్లలో విడుదల అయ్యింది. అప్పట్లో డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తోంది ఆహా ఓటీటీ. 'జిలేబి' చిత్రాన్ని ఈ నెల (జూలై) 13వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది.
Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
'జిలేబి' చిత్రంలో నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు. మురళీ శర్మ, 'గెటప్' శ్రీను, 'గుండు' సుదర్శన్, 'బిత్తిరి' సత్తి తదితరులు కీలక పాత్రల్లో నటించిన 'జిలేబి' చిత్రానికి కూర్పు: ఎంఆర్ వర్మ, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, సంగీతం: మణిశర్మ, చిత్ర సమర్పణ: అంజు అశ్రాని, నిర్మాణ సంస్థ: ఎస్సార్కే ఆర్ట్స్, నిర్మాత: గుంటూరు రామకృష్ణ, దర్శకత్వం : కె. విజయ భాస్కర్.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?