Telugu Indian Idol Season 3 Semi Finale Promo: ప్ర‌ముఖ ఓటీటీ ఆహా వేదిక‌గా స్ట్రీమ్ అవుతున్న షో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ - 3. మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని మెస్మ‌రైజ్ చేసింది ఈ షో. కంటెస్టెంట్లు ఒక‌రిని మించి ఒక‌రు పోటీప‌డ్డారు. ఇక ఈ షో ఫైన‌ల్స్ కి చేరువ‌లో ఉంది. ఈ శుక్ర‌వారం ప్రీ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ప్రోమో చాలా క్రేజీగా ఉంది. సింగ‌ర్స్ అంద‌రూ అద్భుతంగా ప‌ర్ఫామ్ చేశారు. 'ఫైనల్ జాతరకు మరో అడుగు' అనే క్యాప్ష‌న్ తో ఆ ప్రోమోని రిలీజ్ చేసింది ఆహా. 


చిరంజీవి స్టెప్ వేసిన త‌మ‌న్


కంటెస్టెంట్ల పాట‌ల మ‌ధ్య‌లో కొన్ని క్రేజీ టాస్క్ లు పెట్టారు. ఆ టాస్క్ ని క్రేజీగా ఆడారు జ‌డ్జిలు, కంటెస్టెంట్లు. 'యాక్టింగ్ తో అరిపించేస్తా' అనే టాస్క్ లో త‌మ‌న్ ప‌ర్ఫామెన్స్ ఇర‌గ‌దీశారు. మెగాస్టార్ చిరంజీవి పాట 'దాయి దాయి దామ్మా' పాట‌లోని వీణ స్టెప్ వేశాడు. అంద‌రినీ న‌వ్వించాడు త‌మ‌న్. ఇక ఆ త‌ర్వాత కంటెస్టెంట్స్ లో ఒక‌రు చేసిన ప‌ర్ఫామెన్స్ అంద‌రికీ న‌వ్వు తెప్పించింది. 


సూప‌ర్ పాట‌ల‌తో కంటెస్టెంట్లు.. మెస్మ‌రైజ్ అయిన జ‌డ్జ్ లు


ఇక సింగ‌ర్స్ ఒక‌రిని మించి ఒక‌రు పాట‌లు పాడారు. అద్భుతంగా ప‌ర్ఫామ్ చేశారు. దీంతో మెస్మ‌రైజ్ అయ్యారు జ‌డ్జ్ లు. అందరికీ అద్భుత‌మైన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అంతే కాకుండా వెరైటీ డైలాగులు చెప్తూ డిఫ‌రెంట్ గా జ‌డ్జ్ మెంట్ ఇచ్చారు. 






సింగ‌ర్ సాకేత్ స్పెష‌ల్ ప‌ర్ఫామెన్స్.. 


సింగ‌ర్ సాకేత్ ఈ ఎపిసోడ్ లో స్పెష‌ల్ పర్ఫార్మన్స్ ఇవ్వ‌నున్నారు. కంటెస్టెంట్ నసీరుద్దీన్ తో క‌లిసి ఆయ‌న పాడారు. న‌సీరుద్దీన్ కి ఒక‌ప్పుడు తాను మెంట‌ర్ అని, ఇప్పుడు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు సాకేత్. 'ఆశాపాశం బంధీ చేసేనే...' పాట‌ను ఇద్ద‌రు క‌లిసి అద్భుతంగా ఆల‌పించారు. ఓవ‌ర్ ఆల్ గా ప్రోమో మొత్తం చూస్తే చాలా క్రేజీగా అనిపించింది. ఇక ఈ ఎపిసోడ్ త‌ర్వాత ఫైన‌ల్స్ కి వెళ్లేవారు ఎవ‌రో తేల‌నుంది. 


12 మందిలో చివ‌రికి ఐదుగురు.. 


‘తెలుగు ఇండియన్ ఐడల్ 3‘ చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలో ఈ షో విజేత ఎవరో తేలిపోనుంది. సుమారు 15 వేల మంది గాయకులు ఈ పోటీలో పాల్గొనగా, అంద‌రినీ ఫిల్ట‌ర్ చేసి 12 మందిని షోకు ఎంపిక చేశారు. వీరిలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం సెలెక్ట్ అయ్యారు. గత 25 ఎపిసోడ్ లలో ఎలిమినేషన్స్ నిర్వహించగా, చివరకు ఐదుగురు ప్రీ ఫినాలేకు చేరుకున్నారు. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, నసీరుద్దీన్ ప్ర‌స్తుతం ప్రీ ఫినాలేలో ప‌ర్ఫామ్ చేయ‌నున్నారు. 


Also Read: ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో చేయ‌డం ఆనందంగా ఉంది, ఎన్టీఆర్ చాలా ఫ్ల్రెండ్లీ - 'దేవ‌ర'లో విల‌న్ సైఫ్ అలీ ఖాన్