Saif Ali Khan About Devara Movie And Working Experience With Jr NTR: ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది . దాంట్లో భాగంగా ఇతర భాషల నటీనటులు తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. నిజానికి తెలుగు సినిమాల్లో నటించడం వాళ్ల అదృష్టంగా భావిస్తున్నారు. అదే విషయాన్ని చెప్పారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. 'దేవర' సినిమాలో ఆయన విలన్ గా నటించిన విషయం తెలిసిందే. 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన సినిమా గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా తెలుగులో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఎన్టీఆర్ లాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం లవ్లీగా ఉందని అన్నారు. తెలుగులో నటించడంపై ఆయన ఏమన్నారంటే?
ఈ రోల్ కి ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి?
"సౌత్ ఇండస్ట్రీ, ఆంధ్రా నుంచి చాలా అద్భుతమైన సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాంటి ఇండస్ట్రీలో చేయడం ఎగ్జైటింగ్ గా అనిపించింది. అంతే కాకుండా ఇలాంటి పెద్ద సినిమాలో చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, శివ నేనే ఈ సినిమాకు కావాలనుకోవడం హ్యాపీగా ఉంది. నేను చేసింది చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. ఆ వెర్షన్స్, క్రేజీ మేకప్, యాంటీ హీరోగా చేయడం చాలా లవ్లీగా అనిపించింది. కొత్త రకం సినిమా, కొత్త ల్యాండ్ స్కేప్‌లోకి అడుగు పెట్టడంతో కొత్తగా అనిపించింది" అని అన్నారు సైఫ్ అలీ ఖాన్.
ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
"ఎన్టీఆర్ చాలా ఫన్నీ పర్సన్, ఈజీ గోయింగ్ పర్సన్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించింది. చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆఫ్ సెట్స్ లో చాలా ఫ్ల్రెండ్లీగా ఉంటాడు. ఫస్ట్ డే షూట్ రోజు ఆయన నన్ను కలిశారు. నాతో మాట్లాడారు. అప్పుడు చాలా కంఫర్ట్ గా అనిపించింది. చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్. నన్ను తన ఇంటికు పిలిచాడు. వంట వండిపెట్టాడు. చాలా మర్యాదలు చేశాడు. గొప్పగా చూసుకున్నాడు. కెమెరా ముందు చాలా హుందాగా ఉంటాడు. ఆ తర్వాత అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయనకు ఓపిక కూడా చాలా ఎక్కువ. తెలుగులో ఇది ఫస్ట్ సినిమా నాకు. ఆయనతో కలిసి నటించేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీలయ్యేలా చేశాడు" అని జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేయడం గురించి తన ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకున్నారు సైఫ్.
పాన్ ఇండియా సినిమాలపై మీ అభిప్రాయం?
"భారతదేశంలో వివిధ ఇండస్ట్రీలు ఉన్నాయి. అన్ని భాషల, అన్ని రాష్ట్రాల నటులను ఒక సినిమాలో పెట్టి చేయడం అనేది గొప్ప ఐడియా. అది గొప్ప స్టాండర్డ్స్ ని పాటించేందుకు ఉపయోగపడుతుంది. చాలా సినిమాలు అలా చేశారు. భవిష్యత్తులో కూడా అలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నేను చాలా లక్కీ ఈ సినిమా వల్ల తెలుగు నేర్చుకుంటున్నాను. అలా చాలా మంది నటులు వాళ్ల కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల" అని చెప్పుకొచ్చారు సైఫ్ అలీ ఖాన్.
సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న 'దేవర'
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'దేవర'. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ ఇద్దరూ ఈ సినిమాతోనే తెలుగులో పరిచయం కానున్నారు. ఇక ఈసినిమా ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా హిట్ బొమ్మ అని ధీమా వ్యక్తి చేస్తున్నారు.
Also Read: మలైకా ఆరోరా ఇంట విషాదం... బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహ్యత చేసుకున్న తండ్రి