తెలుగు ఓటీటీ 'ఆహా' ప్రేక్షకులకు సరికొత్త వినోదాలను అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను నిర్మించడం, డాన్స్, సింగింగ్, రియాలిటీ షోలు ప్లాన్ చేస్తూ ఆడియన్స్ కి ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే 'ఆహా' నిర్మాణంలో రూపొందిన పలు వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు త్వరలోనే ఆహాలో మరో సిరీస్ రాబోతోంది. 'పాపం పసివాడు' అనే పేరుతో ఓ సిరీస్ ని రూపొందిస్తున్నట్లు ఆహా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.


ప్లే బ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 5విన్నర్ శ్రీరామచంద్ర ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రాశి సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య, మహర్షి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ఆహా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. తాజాగా 'పాపం పసివాడు' ఒరిజినల్ లోని సాంగ్ ను రిలీజ్ చేశారు. ది వీకెండ్ షో నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు.


అంతేకాకుండా సిరీస్ లోని పాత్రలను చూపిస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. సెప్టెంబర్ 29న నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కాబోయే ఈ సిరీస్ కచ్చితంగా ప్రేక్షకులకు కావాల్సినంత భావోద్వేగాలు, నవ్వులను తప్పకుండా అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.



'పాపం పసివాడు' సిరీస్ విషయానికొస్తే.. ఇందులో ఓ పాతికేళ్ల కుర్రాడు అయినా మన కథానాయకుడు క్రాంతి ప్రేమ కోసం హృదయమంత బాధతో పరిసపిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఉన్నట్టుండి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలో ప్రవేశిస్తారు. దీంతో అతని జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అతని జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వీళ్ళ రొమాంటిక్ జర్నీ చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేసేలా మేకర్స్ ఈ సిరీస్ ని తెరకెక్కించారు.


ఇప్పటివరకు ప్లే బ్యాక్ సింగర్ గా సత్తా చాటిన శ్రీరామచంద్ర 'పాపం పసివాడు' సిరిస్ తో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నాడు. లలిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కి కైషోర్ కృష్ణ  సహ దర్శకుడిగా కొనసాగుతున్నారు. గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, గ్యారీ బిహెచ్  ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయ్ మక్కెన ఆర్ట్ డైరెక్టర్ కాగా, జోస్ జిమ్మీ సంగీతాన్ని సమకూర్చారు. నటుడిగా శ్రీరామచంద్ర కి 'పాపం పసివాడు' సిరీస్ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.


 


Also Read : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial