Adi Saikumar's Shanmukha Movie OTT Release On Aha: దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar)  నటించిన లేటెస్ట్ మూవీ 'షణ్ముఖ' (Shanmukha). ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డివోషనల్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement


ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్


ఈ సినిమా ఈ నెల 11 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో (Aha) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను సదరు ఓటీటీ సంస్థ షేర్ చేసింది. 'ఓ పోలీసు, పండితుడు, ఒక పురాతన రహస్యం! అడవిలో లోతుగా పాతిపెట్టబడిన మరచిపోయిన కథలు, దాచిన నిధులు, రహస్యాలలోకి ప్రవేశించండి.' అని ట్వీట్ చేసింది. 






Also Read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?


స్టోరీ ఏంటంటే?


ఎలాంటి వైద్య వసతులు లేని గ్రామంలో విరాండ (చిరాగ్ జానీ) నిత్యం పూజలు చేస్తూ ఉపాసకుడిగా ఉంటాడు. ఈ దంపతులకు 6 ముఖాలతో ఉన్న ఓ కురూపి బిడ్డగా జన్మిస్తాడు. దీంతో వీరు షాక్‌కు గురవుతారు. తన కొడుకుకు మామూలు రూపం, అందం కోసం విరాండ ఓ మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. అతని సలహా మేరకు 6 రాశుల్లో పుట్టిన ఆరుగురు యువతుల రక్త తర్పణాన్ని చేయాలని భావిస్తాడు. దీని కోసం ఒక్కొక్కరుగా యువతుల్ని కిడ్నాప్ చేసి అడవికి తీసుకొస్తారు.


అయితే, ఈ ఆరుగురు యువతులతో పాటే ఆరు రాశుల్ని.. నక్షత్రాల్ని తన చుట్టూ తిప్పుకొనే శక్తులున్న క్లీంకార అలియాస్ సారా (అవికా గౌర్) అనే అమ్మాయిని కూడా ఆ క్షుద్రశక్తులు కోరుకుంటాయి. ఇదే సమయంలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలనే చూస్తుంటాడు ఎస్సై కార్తీ (ఆది సాయికుమార్). ఈ క్రమంలోనే తన పిస్టల్ కోల్పోతాడు. కాలేజీలో లవర్ అయిన సారా ప్రేమ కోసం మళ్లీ కార్తీ ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో యువతుల మిస్సింగ్‌పై సెర్చ్ చేస్తుంటుంది సారా. అసలు డ్రగ్స్ మాఫియా పట్టుకోవడంలో, తన ప్రేమను తిరిగి సక్సెస్ చేసుకోవడంలో కార్తీ విజయం సాధించాడా?, యువతుల మిస్సింగ్ కేసు ఏమైంది?, విరాండ కొడుకుకి సాధారణ రూపం వచ్చిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను అలరించే హీరో ఆది సాయికుమార్ ఈసారి కూడా అలాంటి ప్రయోగమే చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన 'షణ్ముఖ' మూవీతో ప్రేక్షకులను అలరించారు. సరైన విజయాలు లేకున్నా ప్రయోగాలు చేస్తూ చెరగని ముద్ర వేశారు. ఈ సినిమాలో ఆయన సరసన ఆవికా గౌర్ నటించారు. ఆమెతో పాటు ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సాప్పని, వీరశంకర్, కృష్ణుడు, సీవీఎల్ నరసింహారావు, చిత్రం శ్రీను, జబర్దస్త్ దొరబాబు, అరియానా గ్లోరి ప్రముఖ పాత్రలు పోషించారు. 


ఈ సినిమాను సాప్ బ్రో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై.. తులసీరామ్ సాప్పని, రమేష్ యాదవ్, షణ్ముగం సాప్పని నిర్మించారు. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.