Just In





OTT Thriller Movie Telugu: ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఓటీటీలోకి అషురెడ్డి సినిమా... ఈ తెలుగు థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Amazon Prime Video New Telugu Movie: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీడీలో ఇవాళ ఒక కొత్త తెలుగు సినిమా స్ట్రీమింగ్ మొదలు అయింది. అషు రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు అమ్మాయి, సోషల్ మీడియా నుంచి మొదలు పెట్టి రియాలిటీ షోలు, ఆ తర్వాత సినిమాల వరకు వచ్చిన అందాల భామ అషు రెడ్డి. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన ఒక తెలుగు సినిమా ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆ సినిమా ఏది? అంటే...
ప్రైమ్ వీడియోలో 'పద్మవ్యూహంలో చక్రధారి'
Padmavyuham Lo Chakradhari OTT Platform: అషు రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పద్మవ్యూహంలో చక్రధారి'. ప్రవీణ్ రాజ్ కుమార్, శషికా టిక్కూ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఇందులో భూపాల్, ధనరాజ్, మధునందన్, 'బలగం' రూపాలక్ష్మి ఇతర ప్రధాన తారాగణం.
థియేటర్లలో జూన్ 21, 2024లో 'పద్మవ్యూహంలో చక్రధారి' సినిమా విడుదల అయ్యింది. అంటే... పది నెలలు దాటింది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు... 'పద్మవ్యూహంలో చక్రధారి'ని చూడలేరు. ఈ సినిమా రెంటల్ బేసిస్ మీద రిలీజ్ అయ్యింది. సో, సినిమా చూడాలి అంటే 99 రూపాయలు కట్టి చూడాలి. అదీ సంగతి!
Also Read: ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి... చావు తప్ప మరో దిక్కు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ
రాయలసీమ నేపథ్యంలో తీసిన సినిమా
రాయలసీమ నేపథ్యంలో 'పద్మవ్యూహంలో చక్రధారి' తెరకెక్కింది. ఇందులో అషు రెడ్డి టీచర్ రోల్ చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారనే ఆవేదన ఆ అమ్మాయిలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఇమేజ్ కు భిన్నమైన రోల్ చేశారు. ఇక హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే... నచ్చిన అమ్మాయి చెయ్యి పట్టుకుంటే ఆమెకు ఏదో ఒక దెబ్బ తగులుతుంది. అటువంటిది ఒక అమ్మాయితో అతను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నిజమైన ప్రేమను అర్థం నిర్వచిస్తూ రాయలసీమ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
Also Read: సమ్మర్‌లో సందడికి సిద్ధమైన 'వర్జిన్ బాయ్స్'... క్రియేటివ్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ అప్డేట్