Harsh Roshan's Tuk Tuk Movie OTT Release Date On ETV Win: 'కోర్ట్' మూవీ ఫేం హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'టుక్ టుక్'. గత నెల 21న రిలీజైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.
ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్
'టుక్ టుక్' మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ తాజాగా వెల్లడించింది. 'జీవితకాలపు ప్రయాణంలో మీరూ పాలుపంచుకోండి. ఓ సరదా, భయపెట్టే, ఎమోషనల్ జర్నీ మీకోసం ఎదురుచూస్తోంది. మిస్ కావొద్దు.' అంటూ ట్వీట్ చేసింది.
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీకి సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్‌తో పాటు కార్తికేయ దేవ్, శాన్వీ మేఘన, స్టీఫెన్ మధు వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ కథ సాగుతుంది. గ్రామాల్లో ఆడపిల్లల పట్ల ఉండే వివక్ష, వారి స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు ఉంటాయనే అంశాలను ఎమోషనల్‌గా చూపించారు.
Also Read: ఈ వారమే ఓటీటీలోకి రూ.50 కోట్లు సాధించిన 'కోర్ట్' మూవీ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆ మూవీస్ ఫ్రీగా చూసెయ్యండి
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త వారిని పరిచయం చేసేలా 'కథా సుధ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'ఈటీవీ విన్' ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం కొత్త కథతో 52 కథలు తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాయి. ఇప్పటికే లైఫ్ పార్ట్‌నర్, ఉత్తరం రెండు స్టోరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు షార్ట్ స్టోరీస్‌ను ఫ్రీగా చూడొచ్చని 'ఈటీవీ విన్' తెలిపింది.
'లైఫ్ పార్ట్‌నర్' స్టోరీ ఏంటంటే?
మహా నగరంలో ఐటీ ఉద్యోగి సూర్య ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు తాను ప్రేమించిన తారను అతని స్నేహితుడు ఆకాశ్ సూర్య ఇంటికి తీసుకొచ్చి ఆమెను వారం పాటు ఇక్కడే ఉంచాలని అంటాడు. తార ఫ్యామిలీ నుంచి ప్రమాదం ఉందని.. ఢిల్లీలో ఓ ప్రాజెక్టు పని పూర్తైన తర్వాత ఆమెను తీసుకుని ఫారిన్ వెళ్లిపోతానని అంటాడు ఆకాశ్. తాను స్కూల్ డేస్‌లో ఇష్టపడిన తారను సూర్య ఆ తర్వాత ఏం చేశాడు?, తారకు తన మనసులో మాట చెప్పాడా? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇందులో శ్రీహాన్, సోనియా సింగ్, అజున్ దేవ్ కీలక పాత్రలు పోషించారు.
'ఉత్తరం' స్టోరీ ఇదే!
కొత్తగా పెళ్లైన చిన్ని ఆషాడ మాసంలో పుట్టింటికి వస్తుంది. ఎప్పుడూ భర్తతో ఛాట్స్, వీడియో కాల్స్, ఫ్రెండ్స్‌తో ఫోన్లలో గడపడంపై ఆమె నాన్నమ్మ తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆమె చిన్నికి ఉత్తరం ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పరిణామాల తర్వాత చిన్ని తన భర్తకు ఫోన్ చేసి ఏం చెప్పింది? అనేదే కథ. స్టోరీలో పూజిత పొన్నాడ, బాలాదిత్య, తులసి ప్రధాన పాత్రలు పోషించారు. రాబోయే ఆదివారాల్లో 'లవ్ యూ నానమ్మ', 'వెండి పట్టీలు' వంటి స్టోరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.