Priyadarshi's Court Movie OTT Release On Netflix: నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కోర్ట్' (Court). బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్‌కు చెక్ పెడుతూ 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ రిలీజ్‌పై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది.

ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్

ఈ నెల 11 నుంచి 'కోర్ట్' మూవీ స్ట్రీమింగ్ కానుందని 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. ప్రియదర్శితో పాటు శివాజీ, హర్షవర్ధన్, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. కోర్డ్ బ్యాక్ డ్రాప్‌లో పోక్సో యాక్ట్ ప్రధానాంశంగా తెరకెక్కిన మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మంగపతిగా శివాజీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. విజయ్ బుల్గానిన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Also Read: 'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..

స్టోరీ ఏంటంటే?

'కోర్ట్' బ్యాక్ డ్రాప్ అంశంతో పోక్సో యాక్ట్ ప్రధానాంశంగా 'కోర్ట్' మూవీని తెరకెక్కించారు. ఈ స్టోరీ 2013 నేపథ్యంలో సాగుతుంది. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. అతని తండ్రి వాచ్ మెన్ కాగా తల్లి గృహిణి. ఓ ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా పెద్దింటి అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావించే ఆ అమ్మాయి ఇంట్లో ఈ విషయం తెలిసి ఆమె మామయ్య యువకునిపై తప్పుడు కేసులు పెట్టిస్తాడు. కఠినమైన పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి జైల్లో పెట్టిస్తాడు. 

దీంతో యువకుని కుటుంబం తీవ్ర ఆవేదన గురి కాగా.. లాయర్లను సైతం అమ్మాయి మామ కొనేస్తాడు. ఈ క్రమంలో యువకుని కుటుంబ వేదన తెలుసుకుని ఓ యువ లాయర్ అండగా నిలుస్తాడు. పెద్దలందరికీ ఎదురెళ్లి మరీ యువకుని తరఫున కేస్ వాదిస్తాడు. ఇంతకూ ఆ యువకునికి న్యాయం జరిగిందా..?, ఈ కేసుల నుంచి యువకుడు ఎలా బయటపడ్డాడు.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా దాదాపు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కోర్ట్ డ్రామాగా పోక్సో చట్టంపై అవగాహన పెంచేలా కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతం అంటూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ప్రియదర్శి సహా మంగపతిగా శివాజీ నటన వేరే లెవల్ అంటూ ప్రశంసించారు.