Satyadev's Arabia Kadali Web Series Trailer Released: సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి వెళ్లిన ఏపీ మత్స్యకారుల స్టోరీ ఆధారంగా రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'అరేబియా కడలి'. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement


ట్రైలర్ అదుర్స్


సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏపీ మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున ప్రవేశించి పాక్ కోస్ట్ గార్డుకు చిక్కిన ఉదంతం బ్యాక్ డ్రాప్‌గా ఈ సిరీస్ రూపొందింది. '8 మంది మత్స్యకారులు భద్రపట్నం జిల్లాకు చెందిన వారని ప్రాథమిక విచారణలో తేలింది.' అంటూ ఓ టీవీ న్యూస్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... పాక్ నేవీ బోట్లకు భారత మత్స్యకారులు చిక్కడం నుంచి అక్కడి జైలులో వారు పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించారు. 


న్యాయసహాయం కోసం ఈ 8 మంది మత్స్యకారులు ఏం చేశారు. పాక్ జైల్లో మగ్గుతున్న వారిని ఆ చెర నుంచి విడిపించింది ఎవరు? వారికి న్యాయ సహాయం ఎలా అందింది? పాక్ జైల్లో అధికారుల వల్ల వారు పడ్డ ఇబ్బందులేంటి? అనేది తెలియాలంటే సిరీస్ తప్పకుండా చూడాల్సిందే.






Also Read: తండ్రి సొంతింటి కల కొడుకు నెరవేర్చాడా? - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన '3 BHK'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ఈ సిరీస్‌కు సూర్య కుమార్ దర్శకత్వం వహించగా... స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రచయిత, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించారు. సత్యదేవ్, ఆనందితో పాటు రఘుబాబు, నాజర్, పూనమ్ బజ్వా, దలీప్ తాహిల్, హర్ష రోషన్, ప్రభావతి, ప్రత్యూష సాధు, వంశీకృష్ణ, కోట జయరాం, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవివర్మ, అలోక్ జైన్ కీలక పాత్రలు పోషించారు.


ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?


'అమెజాన్ ప్రైమ్' కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందించిన ఈ సిరీస్ ఈ నెల 8 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే ఇలాంటి కథతో 'తండేల్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, 'అరేబియా కడలి' ఆ కథలన్నింటికీ డిఫరెంట్ అని, కొత్తదని మేకర్స్ తెలిపారు. 


స్టోరీ ఏంటంటే?


అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున ప్రవేశించిన ఏపీ మత్స్యకారులను పాక్ నేవీ అధికారులు పట్టుకుని జైల్లో పెడతారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతాయి. తమ వారిని పాక్ చెర నుంచి విడిపించాలంటూ ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. చివరకు వారు ఎలా బయటకు వచ్చారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ అందింది? అనేదే ఈ సిరీస్‌లో చూపించినట్లు తెలుస్తోంది.