Siddharth's 3BHK Movie OTT Streaming On Amazon Prime Video: తమకంటూ సొంతిల్లు ఉండాలనుకునే ఓ మధ్య తరగతి కుటుంబం దాన్ని సాకారం చేసుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేదే బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 3BHK. సిద్ధార్థ్, ఆర్ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శక్తి టాకీస్ అధికారికంగా ప్రకటించింది. విదేశాల్లో అయితే 'సింప్లీ సౌత్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించగా... అరుణ్ విశ్వ నిర్మించారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా నటించగా... దేవయాని కీలక పాత్ర పోషించారు. మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'కింగ్డమ్' కలెక్షన్స్... విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్? మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

స్టోరీ ఏంటంటే?

వాసుదేవ్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) దంపతులది మధ్య తరగతి కుటుంబం. వారికి ఇద్దరు పిల్లలు ప్రభు (సిద్ధార్థ్), ఆర్తి (మీథా రఘునాథ్). సొంత ఫ్లాట్ కొనుక్కోవాలనేది వారి కల. హైదరాబాద్‌లో ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేసే వాసుకి అది తలకు మించిన పనే అవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో తాను సాధించలేకపోయింది తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు. అయితే, కెరీర్ పరంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు ప్రభు. 

34 ఏళ్లు వచ్చినా సరైన ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తుంటాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి. ఇదే టైంలో ఐశ్వర్యతో (చైత్ర జే ఆచార్య) లవ్, పెళ్లి స్టోరీ జరుగుతుంది. అసలు ప్రభు తన తండ్రి కల నెరవేర్చాడా? కోరుకున్న విధంగా 3BHK ప్లాట్ కొనుగోలు చేశారా? ఈ క్రమంలో ఓ మధ్య తరగతి కుటుంబానికి ఎదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.