కెవిన్ హీరోగా (Actor Kavin) న‌టించిన 'దాదా' మూవీ (Dada Movie) త‌మిళంలో  బ్లాక్‌ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ మూవీ 'పాపా' పేరు (Papa Movie)తో తెలుగులోకి డ‌బ్ అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి 'పాపా' మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  

రిలీజైన విష‌యం తెలియ‌కుండా!'పాపా' మూవీలో కెవిన్‌కు జోడీగా అప‌ర్ణ‌ దాస్ హీరోయిన్‌గా న‌టించింది. గ‌ణేష్ కే బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా థియేట‌ర్ల‌లో రిలీజైన దాదా మౌత్‌ టాక్‌తో పెద్ద హిట్ట‌య్యింది. త‌మిళ వెర్ష‌న్ రిలీజైన రెండేళ్ల త‌ర్వాత 'పాపా' పేరుతో తెలుగులోకి వ‌చ్చింది. ఈ ఏడాది జూన్‌లో తెలుగులో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో రిలీజైన విష‌యం తెలియ‌కుండానే థియేట‌ర్ల నుంచి వెళ్లిపోయింది. 

'పాపా' సినిమా స్టోరీ ఏంటంటే?'దాదా' మూవీతోనే కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు కెవిన్‌. జులాయిగా, బాధ్య‌త‌యుత‌మైన తండ్రిగా రెండు షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో కెవిన్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Also Read: 'కింగ్డమ్' కలెక్షన్స్... విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్? మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

కథ విషయానికి వస్తే... మ‌ణికంద‌న్‌, సింధు ఒకే కాలేజీలో చ‌దువుతారు. చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న వీరు ఫిజిక‌ల్‌గా ద‌గ్గ‌ర‌వుతారు. సింధు ప్రెగ్నెంట్ అవుతుంది.  అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల పెళ్లి కాకుండానే ఇద్ద‌రు వేరు కాపురం పెట్టాల్సివ‌స్తుంది. మ‌గ‌పిల్లాడికి జ‌న్మ‌నిచ్చిన సింధు...ఆ చిన్నారిని మ‌ణికంద‌న్ వ‌ద్ద వ‌దిలేసి అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత ఏమైంది?  జులాయిగా తిరిగే మ‌ణికంద‌న్ జీవితం ఆ చిన్నారి రాక‌తో  ఎలాంటి మ‌లుపులు తిరిగింది?  త‌ల్లికి దూర‌మైన ఆ చిన్నారిని మ‌ణికంద‌న్ ఎలా పెంచాడు?  మ‌ణికంద‌న్‌, సింధు మ‌ళ్లీ క‌లిశారా?  లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

Also Readరేపిస్టులు, హంతకులు హాయిగా బతకొచ్చు... కానీ కుక్కలకు? - రేణూ దేశాయ్ ఆవేదన

ప్ర‌స్తుతం త‌మిళంలో మోస్ట్ బిజీయోస్ట్ హీరోగా కొన‌సాగుతోన్నాడుకెవిన్. 'కిస్‌', 'మాస్క్‌'తో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు. 'దాదా' మూవీలో హీరోయిన్‌గా న‌టించిన అప‌ర్ణ దాస్ తెలుగులో 'ఆదికేశ‌వ' సినిమా చేసింది.