Sarkaar 4 Latest Episode Promo: సుడిగాలి సుధీర్... బుల్లితెరపై అతడు చాలా అంటే చాలా పాపులర్. అతడిని 'ఆటగాడు' అని కొందరు అంటుంటారు. టీవీ షోల్లో అతడికి ప్లే బాయ్ ఇమేజ్ అంటగట్టారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ' చేసినప్పుడు రష్మీతో ట్రాక్ నడిపారు. 'పోరా పోవే' చేసినప్పుడు విష్ణుప్రియా భీమనేనితో ట్రాక్ నడిపారు. మిగతా టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ వంటివి చేసినా ఎవరో ఒకరికి లైన్ వేసినట్టు చూపించడం కామన్. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చెయ్యడం కోసం సుధీర్ కూడా ఆ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అటువంటి సుధీర్ షాక్ అయ్యే రేంజిలో ఫ్లర్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది హమీదా. 'సర్కార్' లేటెస్ట్ ప్రోమోలో సుధీర్, హమీదా ట్రాక్ వైరల్ అవుతోంది.

  


హగ్గులతో ముంచెత్తిన హమీదా... అసలు తగ్గలేదు!
Hamida flirts with Sudigali Sudheer: హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్ షో 'సర్కార్'. సీజన్ 4కి 'సుడిగాలి' సుధీర్ యాంకరింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. పదో ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా రిలీజ్ అయ్యింది. యాంకర్ స్రవంతి చొక్కారపు, 'కార్తీక దీపం' & 'బిగ్ బాస్' ఫేమ్ శోభా శెట్టి, 'బ్రహ్మముడి' & 'బిగ్ బాస్' ఫేమ్ హమీదా, శుభశ్రీ రాయగురు వచ్చారు.


హమీదా వచ్చిన తర్వాత 'హ్యాపీ బర్త్ డే' అని చెప్పాడు సుధీర్. 'థాంక్యూ' అంటూ అతడికి హగ్ ఇచ్చింది. 'మెనీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే' అని ఇంకోసారి చెప్పాడు. మళ్ళీ హగ్ ఇచ్చింది. 'దేవకన్యలు తిరుగుతారు భూమ్మీద... దానికి సాక్ష్యం హమీదా' అని ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు సుధీర్. మళ్ళీ హగ్ ఇచ్చింది. 


గేమ్ స్టార్ట్ అయ్యాక 'సుధీర్‌ను అలా చూస్తుంటే నాకు బిడ్ చేయాలని అనిపించడం లేదు' అని చెప్పింది హమీదా. షోకి సుధీర్ గురించి వచ్చానని చెప్పింది ఇంకోసారి. ప్రేమ అంటే గుడ్డిగా నమ్మడం అని సుధీర్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఆమె హగ్ ఇచ్చిన తర్వాత 'దేవుడు ఓదారుస్తున్నాడు' అని స్రవంతి చొక్కారపు అంటే... 'యు ఆర్ రాంగ్. తడిమేస్తున్నాడు' అంటూ వాయిస్ ఓవర్ వినిపించింది.


Also Read: రష్మీ డబుల్ మీనింగ్ జోక్స్... అంత డర్టీ మైండా... రోహిణీ కూడా తక్కువేం తినలేదు, హేమ రేవ్ పార్టీనీ వదల్లేదు!



సుధీర్ మీద సెటైర్స్ వేసిన స్రవంతి, శోభా!
'అమ్మాయిలు అబ్బాయిల్ని చూస్తే పౌడర్ రాస్తారు. లేదంటే లవ్ లెటర్లు రాస్తారు. నన్ను చూస్తే ఏం రాసుకోవాలని అనిపిస్తుంది?' అని స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu)ను సుధీర్ అడిగాడు. 'నాకు అర్జెంటుగా జండూ  బామ్ రాసుకోవాలని అనిపిస్తోంది' అని ఆవిడ చెప్పింది. 


తనకు నార్మల్ ఇంట్రడక్షన్ ఇచ్చారని శోభా శెట్టి (Shobha Shetty) అలిగింది. ఆ తర్వాత సుధీర్ 'ఎంతో మంది చచ్చిపోతారు పాము కుట్టి... ఇప్పుడు వస్తుంది శోభా శెట్టి' అని చెప్పాడు. అదీ ఆమెకు నచ్చలేదు. ఆ తర్వాత శుభ శ్రీ వచ్చిన తర్వాత 'నాకేం ఎలివేషన్ ఇవ్వరా?' అని అడిగింది. అప్పుడు 'మా ఇంట్లో ఉంటుంది డబ్బు... షోకి వచ్చింది సుబ్బు - ఇటువంటివే వస్తాయి' అని శోభా శెట్టి తన డిసప్పాయింట్ మెంట్ వ్యక్తం చేసింది.


Also Readకల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!